English   

బాలీవుడ్ మార్కెట్ కోసం బన్నీ మాస్టర్ ప్లాన్ 

Allu Arjun
2021-06-15 16:06:11

టాలీవుడ్ స్టార్లంతా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. ముంబై ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆదిపురుష్ తో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ తో.. చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ పై దృష్టి పెట్టగా.. పవన్ కల్యాణ్ కూడా హరి హర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బన్నీ కూడా పుష్ప ద్వారా బాలీవుడ్ మార్కెట్ పై పట్టుసాధించేందుకు సిద్ధమయ్యారు.

అందులో భాగంగానే.. పుష్పను రెండు భాగాలుగా తీసుకురావడం.. హిందీ పార్ట్ కోసం బాలీవుడ్ నుంచి ప్రత్యేక యాక్టర్లు, టెక్నీషియన్లను ఈ మూవీలో భాగం చేయడం చేస్తున్నారు. అలాగే హిందీ వెర్షన్ కోసం ఐటమ్ సాంగ్ ను ప్రత్యేకంగా ఓ బాలీవుడ్ బ్యూటీతో చేయించేందుకు సిద్ధమయ్యారట.

 పుష్ప మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేలా ఓ భారీ ప్రమోషన్ ఏజెన్సీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఈ ప్లాన్ సక్సెస్ అయితే.. నెక్ట్స్ నేషనల్ లెవెల్లోనే స్ట్రేయిట్ హిందీ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట అల్లు అర్జున్. 

More Related Stories