English   

హ్యాపీ బ‌ర్త్ డే టూ అల్లుఅర్జున్..

Allu-arjun-Naa-peru-surya

కాలం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా మారుస్తుందో చెప్ప‌డం ఊహించ‌డం క‌ష్టం. అల్లుఅర్జున్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌నకు పెద్ద‌గా చ‌దువులు అవి అబ్బ‌లేదు. దాంతో డిగ్రీ కూడా పూర్తి చేయ‌కుండానే సినిమాల వైపు వ‌చ్చేసాడు. నూనూగు మీసాల వ‌య‌సులోనే సినిమా ఇండ‌స్ట్రీకి హీరోగా వ‌చ్చేసాడు బ‌న్నీ. వ‌చ్చీ రాగానే ఈయ‌న్ని చూసి అంతా విమ‌ర్శించిన వాళ్లే ఎక్కువ‌. అస‌లు ఈయ‌న హీరో ఏంటి.. ఇలా ఉన్నాడు వార‌స‌త్వం ఉంటే తోసేస్తారా అంటూ బ‌న్నీని తెగ విమ‌ర్శించారంతా. అన్నింటినీ మౌనంగానే భరించి గంగోత్రితో హిట్ కొట్టి.. ఆర్య‌తో సంచ‌ల‌నం సృష్టించాడు ఈ హీరో. ఇక అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. 

15 ఏళ్లుగా అభిమానుల హృద‌యాల్లో స్టైలిష్‌స్టార్ గా సుస్థిర‌స్థానాన్ని సంపాదించాడు అల్లు అర్జున్‌. ఫ్యామిలి ఆడియ‌న్స్ అల్లు అర్జున్ అంటూ పిలిచినా.. మాస్ ఆడియ‌న్స్ బ‌న్ని అని పిలిచినా.. కేర‌ళ‌లో మ‌ల్లు అర్జున్ అని పిలిచినా.. పిల్ల‌లు ఆర్య అని పిలిచినా ..అభిమానులు స్టైలిష్‌స్టార్ అని పిలిచినా అటు అభిమానుల‌కి ఇటు నిర్మాత‌ల అంద‌రికి అందుబాటులో వుంటూ మా బ‌న్నీ అనిపించుకుటున్నాడు. ఎప్రిల్ 8న ఈయ‌న పుట్టిన‌రోజు. 35 వ‌సంతాలు పూర్తి చేసుకుని.. 36వ వ‌డిలోకి అడుగు పెడుతున్నాడు అల్లు అర్జున్. ప్ర‌స్తుతం ఈయ‌న నా పేరు సూర్య‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ అదిరిపోయింది. ఈ చిత్ర బిజినెస్ కూడా 75 కోట్లు దాటింది.
 
చేసే ప్ర‌తి చిత్రంలోనూ ఓ వైవిధ్య‌మైన పాత్ర చేస్తూ , ద‌ర్శ‌కుడు ఏ కేర‌క్ట‌ర్ ఇచ్చినా ఒదిగిపోతాడు. బ‌న్నీతో ప‌నిచేసిన ఏ ద‌ర్శ‌కుడైనా మ‌ళ్లీ మ‌ళ్లీ పనిచేయాల‌నుకుంటాడు. త‌న డాన్స్ తో తెలంగాణా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా క‌ర్ణాట‌క ముఖ్యంగా కేర‌ళ‌లో స్టార్ హీరోగా ఎదిగారు. ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫేస్‌బుక్ లో కోటి కి పైగా లైక్స్ సాధించిన మెట్ట‌మెద‌టి హీరోగా రికార్డు కూడా నెల‌కొల్పాడు. అంతే కాకుండా వేదం చిత్రం తో మ‌ల్టిస్టార‌ర్ చిత్రాల‌కి తిరిగి శ్రీకారం చుట్టారు. రుద్ర‌మ‌దేవి లాంటి హిస్టారిక‌ల్ ఫిల్మ్ లో చిత్ర యూనిట్ ని కమ‌ర్షియ‌ల్ హిట్ చేయ‌టానికి త‌న ఇమేజ్ ని ప‌క్క‌న పెట్టి గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో ప్రాణం పోసాడు. మొత్తానికి ఏం చేసినా కూడా అభిమానుల‌కు న‌చ్చేలా చేయ‌డం అనేది బ‌న్నీ అల‌వాటు చేసుకున్నాడు. ఈ ప్ర‌యాణం ఇలాగే ముందుకు సాగాల‌ని ఆశిస్తూ మ‌రొక్క‌సారి బ‌న్నీకి బ‌ర్త్ డే విషెస్ చెబుదాం..!
 

More Related Stories