English   

అల్లు అర్జున్  లేట్ అయినా.. లేటెస్ట్ గా..?

allu-arjun
2018-05-02 09:37:38

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. మే 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోందీ మూవీ. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై ఇప్పటి వరకూ పాజిటివ్ టాక్ ఉంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీపైబారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని అందుకోవడం కోసం కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. బన్నీకి ఉన్నక్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి వీలైనంత గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకు వెళుతున్నారు. 

యాక్షన్ కింగ్ అర్జున్, నదియా బన్నీ పేరెంట్స్ గా నటించిన ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెబుతున్నారు. అల్లు అర్జున్ అగ్రెసివ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దేశం అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఓ కుర్రాడు ఆర్మీలో చేరతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు రావాల్సి వస్తుంది. మరి అవేంటీ..? ఎందుకు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అనే కథాంశంతో వస్తోన్న ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటోంది ఎంటైర్ టీమ్. మరి అది నిజమా కాదా అనేది తేల్చాల్సింది ఆడియన్స్ . అది మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. బట్.. ఈ సమ్మర్ లో వచ్చిన రెండు పెద్ద సినిమాలూ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇవి ఓవర్శీస్ లో కూడా భారీ బిజినెస్ చేశాయి. ఆ స్థాయిలో కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి. ఇప్పుడు బన్నీ వాటిని బీట్ చేయకపోయినా.. సూర్య కూడా ఓ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తే కానీ.. అతని రేంజ్ మారదు. 

More Related Stories