English   

అల్లు అర్జున్ కొత్త సినిమా ‘సరైనోళ్లు’..!!

alluarjun
2018-07-10 13:37:17

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత అల్లు అర్జున్  కొత్త సినిమాకు సంబంధించిన వార్తలు ఒక్కొక్కటే వస్తున్నాయి. సరైనోడు తర్వాత సరైన హిట్ అందుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు బన్నీ. దువ్వాడ జగన్నాథమ్  నిరాశపరిచింది. పైగా కలెక్షన్స్ చాలా చెప్పినా.. అంత లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక ఈ సమ్మర్ లో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆల్మోస్ట్ ఫ్లాప్ గా డిక్లేర్ అయింది. దీంతో బన్నీ ఆలోచనలో పడ్డాడు. ఇదే టైమ్ లో రామ్ చరణ్, మహేష్ వంటి హీరోలు రూట్ మార్చి బ్లాక్ బస్టర్స్ కొడితే తను మాత్రం ఇలా ఫ్లాప్ చూడ్డం బన్నీకి మింగుడు పడలేదు. అందుకే చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడా నెక్ట్స్ సినిమా అనే విషయంలో ఏ హింట్ లేకుండా సైలెంట్ గా కథలు వింటూ కూర్చుకున్నాడు.

ఈ నేపథ్యంలో అతని కొత్త సినిమాపై చాలా రూమర్స్ వినిపించాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. విమర్శకులు పెదవి విరిచినా బన్నీ చేసిన సరైనోడు అతని కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా. అందుకే ఆ సినిమా అంటే అల్లు అర్జున్ కు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ ఊరమాస్ ఎంటర్టైనర్ తోనే రావాలనుకుంటున్నాడు. ఇందుకోసం చాలా కథలు రిజెక్ట్ చేశాడు. మొత్తంగా విక్రమ్ కుమార్ చెప్పిన ఓ క్లాస్ స్టోరీని కూడా కాదన్నాడు. తనకోసం కొత్త కథరాయాలన్నాడు. దీంతో విక్రమ్ కుమార్ కూడా తన రూట్ మార్చి బన్నీ కోసం ఓ ఊరమాస్ ఎంటర్టైనర్ తో కథ సిద్ధం చేశాడట. ఈ మూవీలో అల్లు అర్జున్ ది డ్యూయొల్ రోల్.. ఒకటి క్లాస్ ఒకటి మాస్. అంటే సరైనోడుకు డబుల్ మాస్ అన్నమాట. ఈ సినిమా బడ్జెట్ 100కోట్లు అంటున్నారు. ప్రస్తుతం బన్నీ మార్కెట్ కు ఇది చాలా ఎక్కువేఅయినా కంటెంట్ పై నమ్మకంతో పాటు సరైనోడు వంటి ఊరమాస్ ఇచ్చిన ధైర్యంతోనే ఆ బడ్జెట్ కు సై అంటున్నట్టు టాక్. మొత్తంగా మరోసారి సరైనోడు లాంటి ఊరమాస్ ను మళ్లీ కోరుకుంటూ డ్యూయొల్ రోల్ కూడా చేస్తున్నాడంటే దీనికి సరైనోళ్లు కంటే బెటర్ టైటిల్ ఏముంటుందీ.. 


 

More Related Stories