English   

అల్లు అర్జున్ కొత్త ఎత్తుగడ

allu-arjun
2018-05-03 14:14:13

సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ స్టైల్ డిఫరెంట్ అనేది అందరికీ తెలుసు. చాలా వరకూ కొత్తగా వెళతాడు. ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం కూడా ఇలాంటి కొత్త స్ట్రాటజీయే ఫాలో అవుతున్నాడు. అయితే ఇవాళా రేపు ప్రమోషన్స్ ఎంత చేసినా ఫస్ట్ షోకే సినిమా ఫ్యూచర్ తేల్చేస్తున్నారు ఆడియన్స్. ఆడియన్స్ కంటే ముందు రివ్యూవర్స్.. అయితే చెప్పలేం. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షుకులతోనే రివ్యూస్ చెప్పిస్తున్నారు. దీని వల్ల సినిమా రిజల్ట్ ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ ఈ మధ్య రివ్యూవర్స్ కంటే జనరల్ ఆడియన్సే సినిమా రిజల్ట్ ను ఖచ్చితంగా చెబుతున్నారు. వాళ్లు చెప్పిందే నిజమవుతోంది కూడా. ఈ 4న విడుదల కాబోతోన్న నా పేరు సూర్య కోసం ఇప్పటికే పకడ్బందీ ప్లాన్స్ అయిపోయాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త మూడ్(పర్టిక్యులర్ గా మెగా ఫ్యామిలీలో) ఉంది. ఈ మూడ్ దాటుకుని.. రంగస్థలం స్థాయిలో వారి అభిమానులు ఈ సినిమాను ఆదరించాల్సి ఉంది. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బన్నీకి స్పెషల్ గా సొంత ఫ్యాన్ బ్యాంక్ ఉంది. వారిని కూడా ముందే అలర్ట్ చేసి సినిమాకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ టాక్ రాకుండా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరి ఇవన్నీ ఎలా వర్కవుట్ అవుతాయో కానీ.. ఈ సినిమా సూపర్ హిట్ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ కు చాలా ఇంపార్టెంట్. 

More Related Stories