English   

అల్లు అర్జున్ .. అస‌లీ గొడ‌వంతా ఎందుకు...?

Allu Arjun next movie
2018-06-14 10:57:46

లేట్ అయినా లేటెస్ట్ గా అనేది తెలుగులో ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం. కొంద‌రు కామ్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తారు. మ‌రికొంద‌రు దూసుకుపోతున్న‌ట్టు అనిపిస్తారు. బ‌ట్ ఇప్ప‌టికే రేసుగుర్రం అనిపించుకున్న బ‌న్నీ కొంత‌కాలంగా కామ్ గా ఉంటున్న‌ట్టు క‌నిపించాడు. దీంతో చాలామంది ఏదేదో అనుకున్నారు. రొటీన్ సినిమాలు ఇచ్చిన షాక్ లో అత‌ను అలా సైలెంట్ అయిపోయాడ‌నీ.. కొంత‌మంది స్టార్ డైరెక్ట‌ర్స్ బ‌న్నీతో సినిమాలు చేయ‌డానికి సిద్ధంగా లేరని కూడా వినిపించింది. ఆ సౌండ్స్ కు త‌గ్గ‌ట్టుగానే బ‌న్నీ కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండిఒయా త‌ర్వాత కొత్త‌గా ఏ సినిమా ఒప్పుకోలేదు. దీంతో ఈ గాసిప్స్ కు మ‌రింత ఊతం వ‌చ్చింది. ఫైన‌ల్ గా బ‌న్నీ ఇప్పుడు లేట్ అయినా లేటెస్ట్ గా అన్న‌ట్టు.. ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్ట‌ర్స్ తో స‌నిమాకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అల్లు అర్జున్, విక్ర‌మ్ కుమార్ ఈ కాంబినేష‌న్ గురించి చాలారోజులుగా వినిపిస్తోంది. బ‌ట్ ఎవ‌రూ నిజం అనలేదు. ఈ నేప‌థ్యంలో ఈ కాంబినేష‌న్ మ‌రోసారి స్క్రిప్ట్  పైకి వ‌చ్చింది. ఈ ఇద్ద‌రూ సినిమా చేయ‌బోతున్న‌ది నిజ‌మే న‌ట‌. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ స్క్రిప్ట్ పూర్తి చేసే ప‌నిలో ఉన్న‌ట్టు టాక్. ఆల్రెడీ అల్లు అర్జున్ కు అత‌ను చెప్పిన‌ పాయింట్ కూడా న‌చ్చిందంటున్నారు. సో.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కొచ్చ‌ట‌. ఆ త‌ర్వాత బ‌న్నీ చేస్తాడు అని చెబుతోన్న ద‌ర్శ‌కుల సంఖ్య ఎప్ప‌ట్లానే గ్రాండ్ గా ఉంది. 

విక్ర‌మ్ త‌ర్వాత బ‌న్నీ త్రివిక్ర‌మ్ తో చేస్తాడు అనేది టాలీవుడ్ లో ప్ర‌స్తుతం స్ట్రాంగ్ గా వినిపిస్తోన్న మ‌రో వార్త‌. అయితే త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం దేనికీ రియాక్ట్ అయ్యే ప‌రిస్థితుల్లో లేడు. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ పూర్తి చేసి.. ఓ పెద్ద హిట్ కొట్టి.. త‌న పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఆన్స‌ర్ చెప్పి కానీ అత‌ను కొత్త సినిమా వైపు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని అత‌ని స‌న్నిహితులు బ‌లంగా చెబుతున్నారు. సో.. బ‌న్నీ గ్రూప్ చెప్పిన దాంట్లో నిజాలు వెద‌కాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక త‌ర్వాత బ‌న్నీ, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో సినిమా అనేది కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి.. చిరంజీవితో సైరా చేస్తున్నాడు. ఇది పూర్తి కావ‌డానికి ఇంకా చాలా టైమ్ ప‌డుతుంది. ఈ లోగా బ‌న్నీ విక్ర‌మ్ తో సినిమా పూర్తి చేయొచ్చంటున్నారు. అంటే రేసుగుర్రం కాంబినేష‌న్ మ‌ళ్లీ రిప‌టీ్ అవుతుంద‌నుకోవ‌చ్చు.ఏదేమైనా బ‌న్నీ ద‌ర్శ‌కుల లిస్ట్ బానే ఉన్నా.. పాజిబులిటీసే ప్రాబ్ల‌మ్ గా ఉన్నది. అస‌లు ఈ గొడ‌వంతా ఎందుకు...  అల్లు అర్జునే ఏదో ఒక‌టి అనౌన్స్ చేస్తే.. క‌నీసం ఆయ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లైనా ఓ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అనేస్తే.. అస‌లు ఈ గొడ‌వ‌లేవీ ఉండ‌వు క‌దా.. 

More Related Stories