English   

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయింది

Allu arjun next movie confirmed

అల్లు అర్జున్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఏ సినిమా ఒప్పుకోకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సస్పెన్స్ లో పెట్టిన బన్నీ ఫైనల్ గా ఆ సస్పెన్స్ కు తెరదించాడు. అతను చేయబోయే దర్శకుడు ఫైనల్ అయ్యాడు. జస్ట్ అది అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే మిగిలుంది. ఇప్పటి వరకూ మన స్టార్ హీరోలంతా ఊరమాస్ సినిమాలు చేస్తూ వచ్చారు. ఒక దశలో అందరూ ఫ్లాపులు చూశారు. దీంతో అందరూ రూట్ మార్చారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా రొటీన్ కథలకు స్వస్తి చెప్పారు. కానీ అల్లు అర్జున్ సరైనోడు, డిజే అంటూ అవే మాస్ ను మెప్పించే ప్రయత్నం చేసి.. ఫైనల్ గా నా పేరు సూర్య వద్ద ఆగిపోయాడు. ఈ నేపథ్యంలో తానూ మారాల్సిన అవసరం ఉందని గుర్తించాడు కాబట్టే కాస్త ఆచితూచి అడుగులు వేశాడు. ఫైనల్ గా ఆ అడుగులు ఓ టాలెంటెడ్ డైరెక్టర్ వద్ద ఆగిపోయాయి. 

 

సో.. మరి అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోయే ఆ దర్శకుడు విక్రమ్ కుమార్. యస్.. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇది కన్ఫార్మ్. విక్రమ్ కుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా గురించి కొంతకాలంగా వినిపిస్తోంది. ఇదే టైమ్ లో అతను నానితో సినిమా చేస్తాడని.. లేదా మరో హీరోతో వెళతాడని వినిపించింది. ఇటు బన్నీ కూడా విక్రమ్ తో చేయడేమో అన్నారు. బట్ అన్నీటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. మాగ్జిమం ఈ మూవీ గీతా ఆర్ట్స్ లో ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన న్యూస్ అనౌన్స్ చేయడంతో పాటు ఒకేసారి రిలీజ్ డేట్ కూడా చెబుతారట.. సో.. విక్రమ్ కుమార్ విత్ అల్లు అర్జున్.. ఇది ఫిక్స్ .. 

More Related Stories