English   

 బ‌న్నీ జాగ్ర‌త్త ప‌డుతున్నాడుగా..!

allu-arjun

అవ‌స‌రం వ‌చ్చిన‌పుడే అన్ని విలువ‌లు గుర్తొస్తుంటాయి. అది కానీ లేక‌పోతే ఎవ‌డైనా ఒక్క‌టే. మొన్నటి వర‌కు మీడియాను ఆడుకున్నాడు బ‌న్నీ. త‌న ఫ్యామిలీ జోలికి వ‌చ్చినందుకు ఎవ‌డెవ‌డో ఏదేదో రాస్తున్నాడంటూ రెచ్చిపోయాడు. మాధ‌వ‌రంలో జ‌రిగిన నా పేరు సూర్య ఆడియో వేడుక‌లో కూడా మీడియాపై విరుచుకుప‌డ్డాడు. కానీ ఆడియో ఫంక్ష‌న్ ప్రీ రిలీజ్ వేడుక అయ్యేస‌రికి సీన్ అంతా మారిపోయింది. అప్పుడు భారీగా అరిచిన నోరు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. త‌న సినిమా విడుద‌ల‌కు ఇంకా నాలుగు రోజుల స‌మ‌య‌మే ఉంద‌ని అప్పుడు గుర్తొచ్చింది అల్లు అర్జున్ కు. అందుకే ఇప్పుడు అన‌వ‌స‌రంగా మీడియాతో ఎందుకు సున్నం పెట్టుకోవడం అని జాగ్ర‌త్త ప‌డ్డాడు బ‌న్నీ. రామ్ చ‌ర‌ణ్.. అల్లు అర‌వింద్ కాస్త సెటైర్లు వేసినా బ‌న్నీ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అస‌లు ఒక్క మాట కూడా నోరు జార‌లేదు స‌రిక‌దా మీడియాకు థ్యాంక్యూ చెప్పాడు. దీనికి కార‌ణం ఒక్క‌టే సినిమా విడుద‌ల కావ‌డ‌మే. రిలీజ్ కు ముందు మీడియాను కెలికితే క‌చ్చితంగా వాళ్లు సినిమాపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తార‌ని బ‌న్నీకి కూడా తెలుసు. అస‌లే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థ‌లు ఇండస్ట్రీపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో అర‌వ‌డం కంటే ఆలోచించ‌డ‌మే బెట‌ర్ అని కామ్ అయిపోయాడు బ‌న్నీ. మొత్తానికి చూడాలిక‌.. ఈయ‌న శాంతం సినిమాను ప్ర‌శాంతంగా ఆడ‌నిస్తుందో లేదో..?

More Related Stories