English   

అల్లు అర్జున్ ‘ఓవర్’ సీస్

allu arjun
2018-02-27 17:51:42

అల్లు అర్జున్.. తెలుగులో టాప్ హీరోస్ లో ఒకడు. ఇతర హీరోలకు లేని రేంజ్ లో ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ ఓవర్శీస్ లో బన్నీ మార్కెట్ మాత్రం ఆస్థాయిలో లేదనే చెప్పాలి. ఏ సినిమా అయినా ఓవర్శీస్ లో మంచి బిజినెస్ చేయాలంటే హీరో రేంజ్ తో పాటు దర్శకుడి టేస్ట్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు విషయాల్లో కాస్త వీక్ గా ఉన్న బన్నీ కొత్త సినిమాకు అనుకున్న రేంజ్ లో బిజినెస్ కావడం లేదట.

యావరేజ్ సినిమాతో కూడా ట్రెమండస్ హిట్ కొట్టే సత్తా ఉన్న హీరో అల్లు అర్జున్. సరైనోడు, డిజే సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్. ఈ రెండు సినిమాల్లో కంటెంట్ పరంగా గ్రేట్ అనిపించుకున్నవి కావు. కానీ కలెక్షన్లు మాత్రం ట్రేడ్ నే ఆశ్చర్యపరిచాయి. కానీ ఈ తరహా సినిమాలు ఓవర్శీస్ లో వర్కవుట్ కావు అందుకు తగ్గట్టుగానే బన్నీకి ఓవర్శీస్ లో ఇక్కడున్న రేంజ్ అంత మార్కెట్ లేదు. అతని సినిమాల్లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. అందుకు అతనితో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఓ కారణం. త్రివిక్రమ్ కు ఓవర్శీస్ లో స్టార్ హీరోలకూ లేనంత మార్కెట్ ఉంది కాబట్టే సన్నాఫ్ సత్యమూర్తి అక్కడ సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు బన్నీ చేస్తోన్న నా ఇల్లు ఇండియా నా పేరు సూర్య విషయంలో ఇదే రివర్స్ అయింది. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి నాపేరు సూర్య ఇండియాలో మంచి బిజినెస్ చేస్తోంది. డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేట్ పలికాయి. కేరళలో కూడా భారీగా విడుదలవుతుంది. అయితే ఓవర్శీస్ లో మాత్రం కొంత సమస్యగానే ఉందట. అక్కడా బిజినెస్ జరుగుతోంది. కానీ వీళ్లు అనుకున్నంత కాదు. ఈ మూవీని రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. ఈయన సినిమాలకూ ఓవర్శీస్ లో మార్కెట్ లేదు. ఇటు దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే ఫస్ట్ మూవీ. పైగా అతను రైటర్ గా చేసిన సినిమాలూ అక్కడ భారీ వసూళ్లు సాధించలేదు. పైగా ఇలాంటి యాక్షన్ సినిమాలు అక్కడ చాలా చూసి ఉంటారు వాళ్లు. ఈ మొత్తం స్ట్రాటజీతో నా పేరు సూర్యకు కేవలం 4నుంచి 5కోట్ల వరకూ మాత్రమే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట.

4నుంచి 5కోట్లు అనేది అల్లు అర్జున్ రేంజ్ కి చాలా తక్కువ. కానీ ఆ రేంజ్ అక్కడ భారీగా ప్రూవ్ కావాల్సి ఉంది. అందుకే ఆ రేట్ చెబుతున్నారు. కానీ నిర్మాత మాత్రం 9నుంచి 10కోట్ల వరకూ బిజినెస్ వస్తేనే ఇవ్వాలనుకుంటున్నాడట. మరి అంత రేట్ తో కొంటే వర్కవుట్ అవుతుందా లేదా అనేది అక్కడివారికి తెలుస్తుంది. ఈ కారణంగానే ఈ మూవీ ఓవర్శీస్ రైట్స్ ఇంకా అమ్మలేదని తెలుస్తోంది. వరస చూస్తోంటే ఇటు నిర్మాత, అటు బయ్యర్స్ కు మధ్య ఓ ఫిగర్ తో మేటర్ సెటిల్ అయ్యేలా ఉందంటున్నారు. ఒకవేళ ఇలా కూడా కాకపోతే నిర్మాతే రిలీజ్ చేయాలనుకుంటున్నాడని కూడా చెబుతున్నారు.

More Related Stories