English   

రాజకీయాల్లోకి వస్తున్న అల్లు అర్జున్.. వైఎస్సార్ అండగా అడుగులు..

allu arjun
2020-07-16 17:23:21

అల్లు అర్జున్ ఏంటి.. రాజకీయాల్లోకి రావడం ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు బన్నీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. సినిమాలతో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న స్టైలిష్‌ స్టార్‌ రాజకీయాల్లోకి ఎలా వస్తాడు అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొన్నీమధ్యే మొదలైంది. కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు బన్నీ. అందులో ఐకాన్ కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఇదిలా ఉండగానే మరో కొత్త ప్రాజెక్టుకు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. 

గతేడాది ‘యాత్ర’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మహి ఆర్‌ రాఘవతో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఈయన చెప్పిన కథ సింగిల్ సిట్టింగ్ లోనే బన్నీ ఓకే చేసినట్లు తెలుస్తుంది. పూర్తిగా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కథ కూడా ఫైనలైజ్ అయిపోయి స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు మహి. యాత్ర సినిమా డీల్ చేసిన విధానం చూసి బన్నీ ఈ దర్శకుడికి ఫ్లాట్ అయిపోయాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే అల్లు అర్జున్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి రాజకీయ కథా చిత్రం ఇదే అవుతుంది. మరి చూడాలిక.. బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..? 

More Related Stories