English   

ప్రిల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్..ద‌ట్ట‌మైన అడ‌విలో బ‌న్నీ ప‌రుగులు

Allu Arjun
2021-04-03 13:05:53

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ర‌ష్మిక మంద‌న కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ఫ‌. ఈ సినిమాకు సుకుమార్ దర్శ‌క‌త్వం వ‌హించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గంద‌పు చెక్క‌ల స్మంగ్లింగ్ నేప‌థ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు  మ‌ళ‌యాలం హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫ‌స్ట్ లుక్ త‌ప్ప ఇతర అప్డేట్ ల‌ను ఇవ్వ‌లేదు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. చిత్రం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

అయితే తాజాగా చిత్ర యూనిట్ బ‌న్నీ ఫ్యాన్స్ కు ఓ స‌ర్పైజ్ ను ఇచ్చింది. ప్రీల్యూడ్ ఆఫ్ పుష్ప‌రాజ్ పేరుతో ఓ చిన్న వీడియో గ్లింప్స్ ను వ‌దిలారు. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్ చేతులు వెన‌క్కి క‌ట్టేసి ఉండ‌గా ముఖానికి ముసుగు తో ఉన్నాడు. ద‌ట్ట‌మైన అడ‌విలో బ‌న్నీ ప‌రుగులు తీస్తున్నారు. ఇక ఈ వీడియోతో పాటు ఓ అప్డేట్ ను కూడా ప్ర‌క‌టించింది. ఎప్రిల్ 7న సాయంత్రం 6 గంట‌ల 12 నిమిషాల‌కు పుష్ప‌రాజ్ ను ప‌రిచ‌యం చేస్తామ‌ని పేర్కొంది. 18 సెక‌న్ల ప్రీల్యూడ్ వీడియో చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబుర‌ప‌డుతున్నారు. ఇక ఈ చిత్రంలో విల‌న్ కోసం ప‌లువురు పేర్లు వినిపించ‌గా చివ‌ర‌గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ ను ఫిక్స్ చేశారు. 

More Related Stories