English   

నా పేరు సూర్యకు రేసుగుర్రం సెంటిమెంట్..?

Allu-Arjun

అల్లు అర్జున్ కెరీర్ ల ఫస్ట్ టైమ్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన సినిమా నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియో కూడా విడుదలైంది. రీసెంట్ గా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న నా పేరు సూర్యకు అదిరిపోయే టాక్ వస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ గా ముందే ఫిక్స్ అయిపోయిందీ సినిమా. కారణం.. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన రేసుగుర్రం కథ అందించింది ఇప్పుడీ మూవీని డైరెక్ట్ చేసిన వక్కంతం వంశీ. ఇక తను ఫస్ట్ టైమ్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన సినిమా కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బాలీవుడ్ ద్వయం విశాల్ శేఖర్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా.. బన్నీ, అనూ ఇమ్మానుయేల్ జంట మధ్య పండిన కెమిస్ట్రీ మరో హైలెట్ గా చెబుతోన్న నా పేరు సూర్య మే 4న విడుదల కాబోతోంది. సెన్సార్ టాక్ ను బట్టి, రేసుగుర్రం సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం బన్నీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. 

More Related Stories