English   

ఇండియ‌న్ రికార్డ్ సెట్ చేసిన స‌రైనోడు..

Allu-Arjun
2018-03-20 12:16:22

అల్లుఅర్జున్ ఇప్పుడు తెలుగు హీరో అంటే ఒప్పుకోవ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే మ‌నోడి ఇమేజ్ ప‌క్క ఇండ‌స్ట్రీల‌కు కూడా పాకిపోయింది. ఒక‌ప్పుడు ఈయ‌న సినిమా అంటే తెలుగులో మాత్ర‌మే వ‌సూళ్లు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు కేర‌ళ‌లో కూడా వ‌స్తున్నాయి. త‌మిళ‌నాట కూడా జెండా పాత‌డానికి ట్రై చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి. ఇక ఇప్పుడు నార్త్ లోనూ బ‌న్నీ హ‌వా న‌డుస్తుంది. అక్క‌డ తెలుగు హీరోల్లో అల్లుఅర్జున్ కు ఎక్కువ ఇమేజ్ ఉంది. మ‌న హీరోల్లో చాలా మంది గుర్తు ప‌ట్టేది కూడా ఈ హీరోనే. దానికి కార‌ణం హిందీ డ‌బ్బింగ్ సినిమాలు. బ‌న్నీ న‌టించిన సినిమాలు యు ట్యూబ్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. 
ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో బ‌న్నీ ఫాలోయింగ్ చూసి దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు స‌రైనోడు సినిమా కూడా ఇలాంటి సంచ‌ల‌న‌మే సృష్టించింది. ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ ను యు ట్యూబ్ లో ఏకంగా 14 కోట్ల 50 లక్ష‌ల మంది చూసారు. ఓ ఇండియ‌న్ సినిమాకు యూ ట్యూబ్ లో ఇంత‌గా ఆద‌ర‌ణ రావ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ సినిమాల‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. బ‌న్నీ సినిమాల‌కు యూట్యూబ్ లో ఈ మాత్రం రెస్పాన్స్ ఉండ‌టం ఇదే తొలిసారి కాదు. ఈయ‌న డిజే.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి సినిమాలు కూడా యూ ట్యూబ్ లో కోట్ల వ్యూస్ అందుకున్నాయి. మొత్తానికి బ‌న్నీ దూకుడు చూస్తుంటే త్వ‌ర‌లోనే బాలీవుడ్ కు కూడా వెళ్లిపోతాడేమో అనిపిస్తుంది.

More Related Stories