English   

బ‌న్నీ ఒప్పుకున్నాడుగా.. ఫ్లాప్ అని..!

allu-arjun
2018-05-15 13:48:37

త‌న సినిమా థియేట‌ర్స్ లో ఉండ‌గానే.. మ‌రో సినిమాకు స‌న్మానం చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అది బ‌న్నీకి ఉంది.. మ‌హాన‌టి టీంకు ద‌గ్గ‌రుండి మరీ స‌న్మానం చేసాడు అల్లు అర్జున్. అందులో అల్లు అర‌వింద్ తో పాటు రాజ‌మౌళి కుటుంబం కూడా ఉన్నారు. ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ రుణ‌ప‌డేఉంటార‌న్నాడు బ‌న్నీ. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. త‌న సినిమా నా పేరు సూర్య ఫ్లాప్ కావ‌డానికి ఓ కార‌ణం మ‌హాన‌టి కూడా. ఇది కానీ రాక‌పోయుంటే క‌చ్చితంగా సినిమా క‌నీసం మ‌రో 4-5 కోట్లైనా వ‌చ్చుండేది. అయితే అప్పుడు కూడా సినిమా ఫ్లాపే. కానీ సూర్య పూర్తిగా గాడి త‌ప్ప‌డానికి మ‌హాన‌టి కూడా కార‌ణ‌మే. అయినా కూడా ఈ చిత్రానికి స‌న్మానం చేసాడు బ‌న్నీ. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. నా పేరు సూర్య ఫ్లాప్ అని బ‌య‌ట కోడై కూస్తున్నారు ప్రేక్ష‌కులు. అలాంటి స‌మ‌యంలో నిర్మాత 100 కోట్ల పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. అయితే ఇప్పుడు బ‌న్నీనే అస‌లు నిజం ఒప్పుకున్నాడు. త‌న సినిమా ఫ్లాప్ అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఓ ద‌ర్శ‌కుడు వ‌చ్చి క‌థ చెప్పిన‌పుడు కారెక్ట‌రైజేష‌న్ న‌చ్చి చేస్తాన‌ని.. ప్ర‌తీ సినిమా అలా చేసిందే అన్నాడు బ‌న్నీ. హిట్ ఫ్లాప్ అనేది మ‌న చేతుల్లో ఉండ‌వ‌ని.. న‌ట‌న‌లో స‌క్సెస్ అయ్యామా లేదా అనేది కావాల‌న్నాడు బ‌న్నీ. ఈ లెక్క‌న నా పేరు సూర్య ఫెయిల్యూర్ గురించి బ‌న్నీ వ‌ర‌కు వెళ్లింది. వెళ్ల‌కుండా ఎందుకు ఉంటుంది లెండీ.. బ‌య‌ట ఇంత‌గా చ‌ర్చ న‌డుస్తుంటే..! ఏదేమైనా చాలా ఏళ్ల త‌ర్వాత నిఖార్సైన ఫ్లాప్ ఒక‌టి బ‌న్నీకి త‌గిలింది. మ‌రి నెక్ట్స్ సినిమా ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడో ఈ అల్లు వార‌బ్బాయి..?

More Related Stories