English   

రాస్కోరా సాంబ‌.. బ‌న్నీ రెండు సినిమాలు..!

Allu-Arjun
2018-07-05 11:07:57

ఇక్క‌డ ఒక్క సినిమాకే దిక్కు లేదంటే రెండు సినిమాలు చేస్తున్నాడా..? అస‌లు ఏయే సినిమాలు చేస్తున్నాడు అంటూ అభిమానులు కొన్ని రోజులుగా బ‌న్నీ త‌ర్వాతి సినిమాల‌పై ఆరా తీస్తూనే ఉన్నారు. కానీ ఈయ‌న మాత్రం ఏం చేస్తున్నాడో చెప్ప‌డం లేదు. పిల్ల‌ల‌తో ఆడుకుంటున్నాడు కానీ త‌ర్వాతి సినిమా ఏంటో మాత్రం చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతానికి అయితే క‌థ‌లు వింటున్నాడు.. ఎవ‌రి క‌థ న‌చ్చితే వాళ్ల‌కే సినిమా చేయాల‌ని చూస్తున్నాడు అల్లు అర్జున్. చిన్నా పెద్దా.. కొత్త పాత అనే తేడా లేకుండా అంద‌రు ద‌ర్శ‌కులు చెప్పే క‌థ‌లు వింటున్నాడు ఈ హీరో. నా పేరు సూర్య ఫ్లాప్ త‌ర్వాత బ‌న్నీలో చాలా మార్పులు వ‌చ్చాయి. క‌చ్చితంగా ఈ సారి హిట్ కొట్టి స‌త్తా నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు అల్లుఅర్జున్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. వ‌రుడు త‌ర్వాత డిజాస్ట‌ర్ లేని ఈ హీరోకు నా పేరు సూర్య అలాంటి ఫ‌లితాన్నిచ్చింది. పైగా డిజే కూడా యావ‌రేజ్ గానే ఆడింది. దాంతో ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు బ‌న్నీ. దానికి తోడు చేజేతులా ఓవ‌ర్సీస్ మార్కెట్ చేజారింది. ఇలా చాలా స‌వాళ్లు ప్ర‌స్తుతం బ‌న్నీ ముందున్నాయి. అందుకే అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు ఎంచుకుంటున్నాడు. ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్ సినిమాను బ‌న్నీ ఒప్పుకున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని రేసుగుర్రం నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి నిర్మించ‌నున్నాడు.. ఇక ఈ చిత్రంతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఈ హీరో. దీన్ని డివివి దాన‌య్య నిర్మించ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల‌ను ఇప్పుడు బ‌న్నీ ఫైన‌ల్ చేసాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.                  
                          

More Related Stories