English   

సినిమాలోనే కాదు.. జీవితంలోను తగ్గేదే.. లే

 Allu Arjun
2021-04-08 15:31:00

పుష్ప టీజర్ వేడుకలో బన్ని స్పీచ్ ఆద్యంతం ఆలోచింపజేసిందనేది సోషల్ మీడియా డిబేట్. ఈ స్పీచ్ లో అతడు తగ్గేదే లే! అంటూ అభిమానుల్ని ఉత్సాహపరిచాడు.

'నా పుట్టినరోజుకు అభిమానులు చూపుతున్న ప్రేమ కంటే ఇంకేం ఎక్కువ అవసరంలేదు. సుకుమార్ నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి. స్టయిలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా మార్చేశాడు. ప్రతిదీ గుర్తుండిపోయేలా విజయాలు అందించాడు. నేనేం చేసినా అభిమానుల కోసమే. నా జీవితం వారికి అంకితం' అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.  

పుష్ప చిత్రంలోని తగ్గేదే.. లే డైలాగు సినిమాలోనే కాదు.. నా జీవితంతోనూ సంబంధం ఉన్న డైలాగు.. అనేక కష్టనష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నేను ఉత్సాహపరచుకునేటప్పుడు తగ్గేదే.. లే అని అనుకుంటానని తెలిపాడు బన్నీ.  పుష్ప కూడా పాన్ ఇండియా ఫిలిం అని.. అనేక పాన్ ఇండియా చిత్రాల నడుమ పుష్ప కూడా వస్తోందని.. చించేయాల్సిన బాధ్యత అభిమానులదేనని అన్నాడు. 

ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే తను కూడా మైండ్ లో తగ్గేదే.. లే అని ఫిక్సయినట్టున్నాడు. అదిరిపోయే సంగీతం అందించాడు. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నానన్నాడు. చాలాకాలంగా నేను, సుకుమార్, దేవి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఈ సినిమాలోనూ మేం అభిమానులను మెప్పిస్తామని సినిమా గురించి ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. 

More Related Stories