English   

సొంత కుంప‌టి పెట్టుకుంటున్న అల్లుఅర్జున్.. 

2017-04-01 08:01:23

మాట్లాడితే నాకు చిరంజీవి దేవుడు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న దేవుడు అంటూ గొప్ప‌లు చెప్పే ఆ హీరో ఇప్పుడు ఆయ‌నెవ‌రు.. నేనే తోపు అనే స్థాయికి ఎదిగాడు. మొన్న‌టి వ‌ర‌కు త‌ల్లి చాటు బిడ్డ‌లా క‌నిపించిన అల్లుఅర్జున్.. ఇప్పుడు ఆ స్థాయి దాటేసాడు. బ‌న్నీ మాట‌లు వింటుంటే అస‌లు మ‌నం వింటున్న‌ది ఇదివ‌ర‌కు చూసిన అల్లు అర్జునేనా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో బ‌న్నీ క‌మెంట్స్ మంట‌లు రేపుతున్నాయి. కాట‌మ‌రాయుడు టైమ్ లో అభిమానుల్ని కూల్ చేయ‌డానికి ట్రై చేసినా వాళ్లు మాత్రం విన‌డం లేదు. పైగా బ‌న్నీ న‌టించిన డిజే టీజ‌ర్ కు డిస్ లైక్స్ రూపంలో త‌మ కోపాన్ని చూపించారు. 

ఆ మ‌ధ్య‌ విజ‌యవాడ‌లో స‌రైనోడు బ్లాక్ బ‌స్ట‌ర్ ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ అల్లుఅర్జున్ చేసిన క‌మెంట్స్ ఇప్ప‌టికీ ప‌వ‌న్ అభిమానుల దృష్టిలో బ‌న్నీని విల‌న్ గానే చూస్తున్నాయి. ఏదో అభిమానుల్ని కంట్రోల్ చేయ‌డానికి అప్ప‌టికి అలా అన్నాడేమో అనుకున్నారు అంతా. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన ఇంట‌ర్వ్యూలోనూ ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్ అంటూ సేమ్ వ‌ర్డ్స్ రిపీట్ చేసాడు. దాంతో బ‌న్నీ, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ మొద‌లైపోయింది. ఇప్పుడు అల్లుఅర్జున్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఎక్క‌డో కాలుతుంది. అస‌లు త‌మ హీరోను అనే స్థాయి బ‌న్నీకి లేద‌ని వాళ్లు ఫైర్ అవుతున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ను దేవుడు అన్న బ‌న్నీ.. ఒక్క‌సారిగా ప‌వ‌న్ కు ఇలా రివ‌ర్స్ అవ్వ‌డాన్ని ఏమ‌ని అర్థం చేసుకోవాలి..? వ‌ర‌సగా విజ‌యాలు వ‌స్తున్నాయ‌నే బ‌లుపు కాదు క‌దా ఇది అంటూ ఇండ‌స్ట్రీలో క‌మెంట్స్ వినిపిస్తున్నాయి. స‌రైనోడుకు తొలిరోజు నెగిటివ్ టాక్ వ‌చ్చింది.. కానీ ఆ సినిమా ఆ టాక్ త‌ట్టుకుని కూడా 70 కోట్లు వ‌సూలు చేసింది. ఇదే బ‌న్నీలో కాన్ఫిడెన్స్ నింపిందంటున్నారు విశ్లేష‌కులు. త‌న‌కంటే తోపులు మ‌రొక‌రు లేర‌న్న‌ట్లు బ‌న్నీ ఫీల‌వుతున్నాడ‌ని చెబుతున్నారు. పైగా చుట్టూ ఉన్న వాళ్లు కూడా మెగా ఫ్యామిలీలో చిరంజీవి త‌ర్వాత మీరే అనే రేంజ్ లో బ‌న్నీని చెడ‌గొడుతున్నార‌ని స‌మాచారం.

ఇక ఇప్పుడు అల్లుఅర్జున్ ఏకంగా వేరు కుంప‌టి పెట్టుకోడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మెగా ముద్ర లేకుండా త‌న‌ను తాను సొంతంగా ఎదిగాన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం అన్న‌మాట‌. వ‌ర‌స‌గా విజ‌యాలు వ‌స్తుండటంతో బ‌న్నీలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. పైగా కొడుకుని సూప‌ర్ స్టార్ గా చూడానికి అల్లుఅర‌వింద్ కూడా మాస్ట‌ర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. త‌న‌కు తెలిసిన రాజ‌తంత్రాల‌న్ని ప్ర‌యోగిస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను బ‌న్నీ కావాల‌నే దూరం పెడుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం మ‌రోటి ఉంది.. బ‌న్నీ స‌రైనోడు సూప‌ర్ హిట్ రిజ‌ల్ట్ తో 70 కోట్లు వ‌సూలు చేసింది.. కానీ కాట‌మ‌రాయుడు నెగిటివ్ టాక్ తో తొలి వారంలోనే 55 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో బ‌న్నీ, ప‌వ‌న్ మ‌ధ్య ఇంకెన్ని రాజ‌కీయాలు న‌డుస్తాయో చూడాలిక‌..!

More Related Stories