English   

అల్లు అర్జున్ కారును అడ్డుకున్న 500మంది గిరిజనులు

Allu Arjun
2021-01-21 13:00:55

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మండన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ ను శేషాచలం అడవుల్లో ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ తో అది సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వై.రామవరం మండలాల పరిధిలోని తల్లపాలెం కోట పాము బొక్క తదితర ప్రాంతాల్లో చిత్రిస్తున్నారు. దాంతో చిత్ర బృందం ప్రతిరోజు కోట గ్రామానికి వెళుతుంది. ఈ విషయం గమనించిన 500 మంది గిరిజనులు బన్నీ కారును అడ్డుకున్నారు. తాము అభిమానులమని కానీ షూటింగ్ చూడ్డానికి వస్తే అక్కడ ఉండనివ్వడం లేదని బన్నీకి తమ గోడును చెప్పుకున్నారు. దాంతో బన్నీ కారు టాప్ పైకి ఎక్కి వారితో సెల్ఫీలు దిగాడు దాంతో అభిమానులు ఖుషీ అయ్యారు. అంతే కాకుండా బన్నీకి హారతులు ఇచ్చారు. వారి అభిమానం చూసి అల్లు అర్జున్ మురిసిపోయారు.

More Related Stories