English   

ప‌వ‌న్ ను టార్గెట్ చేసిన బ‌న్నీ.. 

pawan-allu-arjun
2018-04-09 08:10:22

అస‌లే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అల్లుఅర్జున్ మ‌ధ్య ఏదో కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని తెలుస్తుంది. ఇద్ద‌రు అభిమానులు కూడా స‌ప‌రేట్ అయిపోయారు. అప్పుడెప్పుడో చెప్ప‌ను బ్ర‌ద‌ర్ క‌మెంట్ త‌ర్వాత బ‌న్నీకి, ప‌వ‌న్ కు మ‌ధ్య భారీ గ్యాప్ వ‌చ్చింది. ఒక‌ప్పుడు ప‌వ‌న్ అంటే దేవుడు అనే బ‌న్నీ ఇప్పుడు ఆయ‌న గురించి పెద్ద‌గా ఎక్క‌డా మాట్లాడ‌టం లేదు. ఇక ఇప్పుడు నా పేరు సూర్య నా యిల్లు ఇండియా టీజ‌ర్ లో పీకేకు బ‌న్నీ ఓ సెటైర్ వేసిన‌ట్లుగా అర్థ‌మైపోతుంది. టీజ‌ర్ లో చిన్న గొడ‌వ‌లో సౌత్ ఇండియ‌న్ సాలా అంటూ వ‌చ్చిన డైలాగ్ ను వాడుకుంటూ.. నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా.. ఈస్ట్ వెస్ట్ అంటూ అన్ని లేవురా ఉన్న‌ది ఒక్క‌టే ఇండియా..! అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్పాడు బ‌న్నీ. ఈ మ‌ధ్య ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోలిస్తే ద‌క్షిణాదిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కావాలనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను తొక్కేస్తున్నారంటూ ప‌వ‌న్ ఫైర్ అవుతున్నాడు. ఆయ‌న ప్ర‌త్యేక‌హోదా కోసం కూడా ట్రై చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాదితో పోలిస్తే ద‌క్షిణాదికి జ‌ర‌గాల్సిన న్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని బాగానే గ‌ళం విప్పుతున్నాడు. ఇలాంటి టైమ్ లో నా పేరు సూర్య‌లో బ‌న్నీ ఇలాంటి డైలాగ్ చెప్ప‌డం ప‌వ‌న్ కు సెటైర్ గానే అనిపిస్తుంది. ఉన్న‌ది ఒక్క‌టే ఇండియా.. ఇక్క‌డ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లేవ‌ని తేల్చేసాడు బ‌న్నీ. కాన్ టెంప‌ర‌రీ ఇష్యూ కావ‌డంతో సినిమా కూడా ఇదే రేంజ్ లో క‌నెక్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అన్న‌ట్లు ఆరెంజ్ తో అన్నీ పోగొట్టుకున్న నాగ‌బాబు ఈ చిత్రంతో మ‌ళ్లీ నిర్మాత‌గా మారాడు. మొత్తానికి చూడాలిక‌.. అల్లుడు సినిమాతో మెగా బ్ర‌ద‌ర్ ఎంత వ‌ర‌కు పైకి లేస్తాడో..?

More Related Stories