English   

ఆర్ఎక్స్100 హీరోకు అల్లు అర్జున్ సపోర్ట్

 Allu Arjun
2021-03-02 14:42:25

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే కార్తికేయ ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో కార్తికేయ నటన..సిక్స్ పాక్స్ బాడీ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించి అలరించిన కార్తికేయ ప్రస్తుతం "చావు కబురు చల్లగా" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా జబర్దస్త్ బ్యూటీ అనసూయ బరధ్వాజ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ లో అలరిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేయగా ముఞ్చి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చ్ 9న నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

More Related Stories