English   

అల్లు అర్జున్‌ తో మురుగదాస్ సినిమా..

 Allu Arjun
2020-05-29 09:22:51

అల్లు అర్జున్‌ తో మురుగదాస్‌ సినిమా అనే ప్రచారం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని కూడా అప్పుడప్పుడూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ‘అల.. వైకుంఠపురములో’ సమయంలో బన్ని కూడా ప్రకటించారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎందుకింకా కార్యరూపం దాల్చలేదన్నది స్పష్టతనివ్వలేదు. అయితే తమ కలయికలో సినిమా ఖాయమని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని అప్పట్లో బన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఏమీ క్లారిటీ లేకున్నా ఇప్పుడీ ప్రాజెక్టు విషయంలో మళ్లీ పనులు మొదలయినట్టు చెబుతున్నారు. దీనిని కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేయచ్చని అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ దళపతి కథానాయకుడిగా ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోండగా ఆ సినిమా గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తుపాకీకి సీక్వెల్ అని అంటున్నారు. తుపాకి సినిమాకి సీక్వెల్ గా రూపొంద‌నున్న ఈ సినిమాలో కూడా విజ‌య్ కి జోడీగా కాజ‌ల్ సంద‌డి చేయ‌నుంద‌ట‌. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో తుపాకి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా మీద క్లారిటీ రావచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా చేయాల్సి ఉంది. ఇక బన్నీ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ సినిమా కూడా అనౌన్స్ చేయాల్సి ఉంది.

More Related Stories