English   

అల్లు అర్జున్ ఇంకా కొన్ని రోజులు ఆగాలి అంటున్నాడు

allu-arjun-Trivikram
2018-11-08 19:26:11

ఎన్నాళ్లో వేచిన అనౌన్స్ మెంట్ దీపావళికి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత అల్లు వారబ్బాయి బాగా ఆత్మరక్షణలో పడిపోయాడు. కొత్త సినిమా ఒప్పుకోవడానికి చాలా అంటే చాలానే ఆలోచిస్తున్నాడు. ఎన్నో కథలు విన్నాడు కూడా. కానీ ఏదీ నచ్చలేదు. కారణం నా పేరుసూర్య ఇచ్చిన ఫ్లాప్ వల్లే. మొత్తంగా త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్టుగా ఓకే అయింది. కాకపోతే ఈ విషయాన్ని ఇంత వరకూ ఇద్దరూ ఓపెన్ గా చెప్పలేదు. అయినా వారి కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అనేది టాలీవుడ్ చెబుతోన్న మాట. మొత్తంగా ఈ దీపావళికి ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయినా వస్తుందనుకున్నారు అభిమానులు. బట్ మరోసారి వారిని నిరాశపరిచాడు అల్లు అర్జున్.

కాకపోతే దీపావళి సందర్భంగా తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘అందరికీ హ్యాపీ దివాళి.ఈ దివాళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలి. ఇక ఇన్నాళ్లూ నా కోసం ఓపికగా ఎదురుచూస్తోన్న అభిమానులకు థ్యాంక్స్. కానీ ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరి కొన్ని రోజుల్లో నేనే అనౌన్స్ చేస్తాను. మీ అందరి  ప్రేమకు, ఓపికకు మరోసారి థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశాడు. కానీ ట్వీట్ అభిమానులను పెద్దగా శాటిస్ ఫై చేసినట్టు లేదు. వాళ్లు మాత్రం ఓ సాలిడ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి వారి వెయిటింగ్ కు బన్నీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాడో కానీ.. త్రివిక్రమ్ కూడా తన మార్క్ టచ్ కోల్పోయాడీ మధ్య. అలాంటిది అతనితో సినిమా అంటే వాళ్లు కూడా మరోసారి ఆలోచించుకుంటే బెటర్.

More Related Stories