English   

అల్లు అర్జున్ ను ఎవరూ పట్టించుకోవడం లేదా..? 

Allu-Arjun
2018-03-08 09:21:26

అల్లు అర్జున్.. మెగా ట్యాగ్ తో ఎంటరై.. అల్లు మేనియా క్రియేట్ చేసుకున్న స్టార్. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్నీ టాలీవుడ్ లో తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ రేంజ్ మార్చుకునేందుకే తంటాలు పడుతున్నాడు. అందుకోసం ఆయన చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. అందుకే బన్నీని ఎవరూ పట్టించుకోవడం లేదా అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో మే 4న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు బన్నీ. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. బిజినెస్ కూడా బానే జరుగుతోంది. అయినా బన్నీ చాలా అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం.. ఇండస్ట్రీలోని కొందరు పెద్ద దర్శకులే అనేది విశ్వసనీయ సమాచారం. యస్.. కొందరు పెద్ద దర్శకులు తనపై చూపిస్తోన్న అన్ ఇంట్రెస్ట్ బన్నీని బాగా బాధపెడుతోందనే మాట టాలీవుడ్ లోనూ చాలామంది నోట వినిపిస్తోంది.
 
నిజానికి అల్లు అర్జున్ టాలెంట్ కు ఎప్పుడో నెక్ట్స్ రేంజ్ కు వెళ్లాల్సింది. కానీ వెళ్లలేదు. ఏ హీరో రేంజ్ మారాలన్నా.. అతని రేంజ్ కంటే పెద్ద రేంజ్ ఉన్న దర్శకుడితో పనిచేయాలి. కానీ బన్నీ విషయంలో ఆ టైమ్ రావడం లేదు. అందుకు ప్రస్తుతం పరిస్థితులూ ఓ కారణం. అసలు విషయం ఏంటంటే.. బన్నీకి రాజమౌళితో పనిచేయాలనేది డ్రీమ్. అది సాధ్యం కావడం లేదు. ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో ఎక్స్ పర్ట్. కానీ అన్ని ఎమోషన్స్ తో హీరోను ఎస్టాబ్లిష్ చేసే దర్శకుడు మాత్రం రాజమౌళే అనడంలో డౌటే లేదు. బాహుబలి తర్వాత రాజమౌళితో పనిచేయాలనే కోరిక తనే వెలిబుచ్చాడు. కానీ జక్కన్న చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చేస్తూ బన్నీని పక్కన బెట్టాడు. తర్వాత మహేష్ బాబుతో ఓ సీనియర్ నిర్మాతతో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. అంటే అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే.. మూడేళ్లకు పైగా టైమ్ పడుతుంది. 

ఇక లేటెస్ట్ గా కొరటాల శివతో సినిమా అనే మాటలు వినిపించాయి. కానీ అతను మాత్రం ఏకంగా నానితో చేయడానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ బన్నీ వైపు చూడ్డం లేదు. ఇది కూడా అతన్ని బాగా బాధపెడుతోందంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా.. అది కేవలం కమిట్మెంట్స్ ను ఫుల్ ఫిల్ చేయడానికే తప్ప ‘వాంటెడ్’ గా ఉండకపోవచ్చంటున్నారు. నిజానికి బన్నీ కూడా త్రివిక్రమ్, సుకుమార్ వంటి టాప్ క్లాస్ డైరెక్టర్స్ తో పనిచేశాడు. కానీ ఆ ఇద్దరివీ నిజంగానే క్లాస్ మూవీస్. అప్పుడెప్పుడో వినాయక్ తో చేసినా ఆయనిప్పుడు ఫామ్ లో లేడు. పైగా మధ్యలో కెరీర్ లో పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. తర్వాత పూరీ జగన్నాథ్.. అతని గురించి బన్నీ కూడా ఆలోచించడం లేదు. సో.. తన రేంజ్ పెరగాలంటే ఖచ్చితంగా రాజమౌళియో లేక కొరటాల శివనో అయితేనే కరెక్ట్ అనేది అతని ఫీలింగ్. అదెలా అనేదే అసలు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో బన్నీ గురించి ఓ కొత్త వార్త వినిపిస్తోంది. 

డైరెక్టర్ క్రిష్ తో అహం బ్రహ్మస్మి సినిమా అనేదే ఆ వార్త. అయితే ఈ వార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీకి సంబంధించి తనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడని. ఎందుకంటే అహం బ్రహ్మస్మిని బాలయ్యతో చేయాలనుకుంటున్నాడు క్రిష్. అయితే బన్నీవైపు మొగ్గితే ఇన్వెస్ట్ మెంట్ తో ఇబ్బంది ఉండదు. మరి బన్ని ఇలా చేయానికీ ఓ కారణం ఉంది. ఇది భారీ ప్రాజెక్ట్. గ్రాఫిక్స్ కు చాలా స్కోప్ ఉంటుంది. క్రిష్ సినిమా అంటే కథలో ఎంత పస ఉంటుందో తెలుసు. ఈ రెండిటికీ తన మాస్ ఇమేజ్ తోడైతే రేంజ్ మారొచ్చనేదే అతని ప్లాన్ అంటున్నారు. ఏదేమైనా తన రేంజ్ మార్చుకోవడానికి బన్నీ మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడనేది నిజం. 

More Related Stories