English   

మహేష్ బాబు, రజినీకాంత్ తో పోటీ నుంచి బన్నీ డ్రాప్..?

mahesh-allu
2018-02-13 19:18:26

మీరు చదివింది కరెక్టే. ఏప్రిల్ 27న రజినీకాంత్ కాలా, మహేష్ బాబు భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఈ మూడు సినిమాలూ పోటీ పడుతున్నాయని చాలా రోజుల నుంచి అప్డేట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడీ డేట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నట్టు టాక్. తప్పుకున్నాడు అంటే భయపడో.. లేక షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లో కాదు. ఆ రోజు నుంచి ఒకరోజు ముందుకు వచ్చాడు. అంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఏప్రిల్ 26నే విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. ఒక రకంగా ఇది ఓపెనింగ్స్ విషయంలో బన్నీకి భారీగా కలిసొచ్చే అంశమే. ఆ నెక్ట్స్ డే రెండు బిగ్గెస్ట్ మూవీస్ ఉన్నాయి కాబట్టి ఒక రోజు ముందే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ సినిమాల్లో ఏ ఒక్కటి విడుదల కాకపోయినా.. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఇక బన్నీని ఆపడం కష్టం. అయితే ఈ రెండోదే జరిగేలా ఉందంటోంది ట్రేడ్. 

నిజానికి మహేష్ బాబు ఏప్రిల్ 27న వస్తున్నట్టు ఇప్పటి వరకూ ఖచ్చితంగా చెప్పింది లేదు. చెప్పినా వస్తారనే గ్యారెంటీ లేదు. కారణం మహేష్ సినిమాలకు పోస్ట్ పోన్స్ అనేవి చాలా కామన్. ఇక రజినీకాంత్ కాలా పరిస్థితి కూడా తేడాగానే ఉంది. ఒకవేళ విడుదలైనా దర్శకుడు రంజిత్ ఆల్రెడీ కబాలితో డిజప్పాయింట్ చేశాడు కాబట్టి.. ఈ సారి ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా బజ్ ఉంటుందనుకోలేం. మొత్తంగా ఇప్పటికైతే టఫ్ ఫైట్ లానే కనిపిస్తోన్న ఈ మూడు సినిమాల కథ ఫైనల్ గా వార్ ఒన్ సైడ్ లా మారేలానే ఉంది.. 

More Related Stories