English   

అజ్ఞాతవాసిగా అల్లు అర్జున్.. అసలు కారణం తెలిస్తే షాక్..

Allu Arjun
2019-12-07 13:33:53

ఏంటి.. అల్లుఅర్జున్ అజ్ఞాతవాసిగా మారడం ఏంటి.. ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ మారాడు కదా.. అయినా అది పెద్దగా కలిసిరాలేదు.. ఇప్పుడు మళ్లీ బన్నీ కూడా అజ్ఞాతవాసి కావడం ఏంటి అనుకుంటున్నారా.. నా పేరు సూర్య తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో షూటింగ్ పూర్తి చేశాడు. జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనితో పాటు సుకుమార్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు అల్లు అర్జున్.

 సింహాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పూర్తిగా సీరియస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు సుకుమార్. ముందు ఈ కథని మహేష్ బాబుతో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేసినా కూడా అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇదే కథను అల్లు అర్జున్ కోసం మార్చేశాడు సుకుమార్. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. 

దాంతో ఇప్పుడు బయటికి వస్తే లుక్ కూడా బయటకు వస్తుందని కొన్ని రోజులు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోవడానికి అల్లుఅర్జున్ ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ రోజు మళ్ళీ మీడియా ముందుకు వస్తాడని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అప్పటి వరకు ఈ లుక్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలకపాత్ర నటించబోతోంది.

More Related Stories