English   

సస్పెన్స్ డ్రామా కంటిన్యూస్.. 

Allu-Arjun
2018-07-30 13:33:01

అల్లుఅర్జున్ తన కెరీర్ లో ఇప్పటి వరకు సస్పెన్స్ డ్రామా చేయలేదు. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో మాత్రం చేస్తూనే ఉన్నాడు. తన నెక్ట్స్ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారని తెలిసినా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం రిస్క్ తీసుకోలేకపోతున్నాడు ఈ హీరో. నా పేరు సూర్య తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు బన్నీ. గీతాగోవిందం ఆడియో వేడుకలో కూడా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నను దాటేసాడు అల్లు వారబ్బాయి. నెక్ట్స్ సినిమా ఏంటో ముందు నాకు తెలిస్తే బాగున్ను.. మీకు చెప్పడానికి అంటూ తప్పించుకున్నాడు. పైగా వీలైనంత త్వరలో చెప్తాను ఇంకొన్ని రోజులు వేచి చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈయన తర్వాతి సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవర్నీ ఫైనల్ చేయలేదు. విక్రమ్ కే కుమార్ సినిమా కథ దాదాపు ఫైనల్ అన్నారు కానీ చివర్లో ఏదో సమస్య వచ్చి ఆగిపోయినట్లు కనిపిస్తుంది. దాంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇక ఈయనతో పాటు పూరీ జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తుంది. తాను ఉన్న పరిస్థితుల్లో ఏ దర్శకున్ని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో అని టెన్షన్ పడుతున్నాడు అల్లు అర్జున్. మరి ఈ సస్పెన్స్ డ్రామా ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి.. 

More Related Stories