English   

రెండు పార్టులుగా పుష్ప..కారణం అదేనట

Allu Arjun
2021-05-11 12:31:10

స్టైలిష్ స్టార్ అల్లున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా టీజర్ ను విడుదల చేయగా 50 మిలియన్ వ్యువ్స్ రికార్డును క్రియేట్ చేసింది. అయితే కొంతకాలంగా ఈ సినిమా పై ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. 

కాగా తాజా మరో వార్త వినిపిస్తోంది. సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయడానికి సినిమా బడ్జెట్ ఏ కారణమంటూ టాక్. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా బడ్జెట్ అనుకున్నదనికంటే దాదాపు 50 శాతం ఎక్కువే  అయిందట. దాంతో రికవరీ అవ్వాలంటే రెండు పార్టులుగా విడుదల చేయాల్సిందే అని భావిస్తున్నారట. అంతే కాకుండా సినిమా కథ కూడా రెండు పార్ట్ లకు సరిపోయేలా ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.

More Related Stories