English   

భారీ ప్లాన్ వేసిన అల్లు అరవింద్..టెన్షన్ లో మెగా ఫ్యాన్స్ 

allu arvind
2020-08-10 17:00:24

మహేష్ బాబు తన మొదటి సినిమా మొదలుకొని తెలుగులో ఇప్పుడున్న బడా బేనర్లు అన్నిటిలో సినిమాలు చేశాడు ఒక్క గీతా ఆర్ట్స్‌ లో తప్ప. ఎందుకంటే ఆ బేనర్లో ఎప్పుడూ మెగా హీరోల సినిమాలే తెరకెక్కుతుంటాయి. అప్పుడప్పడూ బయటి హీరోలతో చిన్న, మీడియం రేంజి సినిమాలు చేస్తుంటారు తప్ప పెద్ద సినిమాలు కానీ పెద్ద స్టార్స్ తో కానీ చేయడం లేదు. కానీ మహేష్ బాబుతో మాత్రం ఒక సినిమా చేయాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం నమ్రత - అల్లు అరవింద్ ల మద్య చర్చలు కూడా జరిగాయని పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. 

సినిమా నిర్మాణంలో భాగస్వామి చేసి లాభాల్లో వాటా ఇమ్మని మహేష్ కోరాడని అందుకు అరవింద్ ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. అలా పరశురామ్ మహేష్ బాబుల కాంబో మూవీని అల్లు అరవింద్ నిర్మించడం కన్ఫర్మ్ అనుకుంటే అది అటకెక్కింది. పరశురామ్ ఇది తేలే యవ్వారం కాదనుకుని తన దారి తను చూసుకుని దానినే మైత్రీ వాళ్ళతో ఫైనల్ చేసుకున్నాడు. ఆ మధ్య గీతా 2 బ్యానర్ లో తెరకెక్కిన 'ప్రతిరోజు పండుగే' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాకి సంబందించిన కీలక ప్రకటన రాబోతుందని బన్నీ వాసు ప్రకటించాడు. దర్శకుడు ఎవరు.. ఎప్పుడు ఉంటుందనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని అప్పుడు అన్నారు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అరవింద్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ లను కలిపి ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి మంచి కథ ఒకటి రాయమని అరవింద్ కొందరు రచయితలకు సూచనలు చేశాడట. అయితే అరవింద్ మల్టీ స్టారర్ తీయాలనుకుంటే మెగా ఫ్యామిలీ లోనే అనేక మంది హీరోలు ఉన్నారు. వాళ్ళకీ మంచి మార్కెట్ ఉంది. మరి వీళ్ళను కాదని  జూనియర్ మహేష్ ల కాంబినేషన్ కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ వార్తలు ఎండాకా నిజమో తెలీదు కానీ అదే నిజమైతే టాలీవుడ్ లో ఇది కూడా భారీ సినిమా అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

More Related Stories