English   

దేశముదురు కొడుకు మహాముదురు

Allu Ayan-chitti-babu
2018-03-23 12:34:34

అల్లు అర్జున్ కొడుకు అయాన్ చిట్టిబాబు అవతారం ఎత్తాడు. రంగస్థలంలో రామ్ చరణ్ లుక్ ను ఇమిటేట్ చేస్తూ బుడ్డోడు అదిరిపోయే స్టిల్ ఇచ్చాడు. అచ్చం రామ్ చరణ్ లాగే గళ్ల లుంగీ, గళ్ల చొక్కా వేసుకుని ఓ కండువాతో అదిరిపోయే ఫోజ్ ఇచ్చాడు. అయాన్ మొదట్నుంచీ తండ్రిలాగే హైపర్ యాక్టివ్ గా కనిపిస్తాడు. ఇక ఈ లుక్ తో మరోసారి ఆడియన్స్  మనసు దోచాడీ బుడ్డుడు. ఆశ్చర్యం ఏంటంటే.. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదు.. అతను రంగస్థలంలోని ఓ పాటకు డ్యాన్స్ వేస్తుంటే తీసిన ఫోటో అన్నమాట. అంటే తన అంకుల్ రామ్ చరణ్ మూవీ బుడ్డోడికి తెగ నచ్చేసినట్టే అనుకోవచ్చు.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. రామ్ చరణ్ రంగస్థలం ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఇప్పటికే రంగస్థలంపై భారీ అంచనాలున్నాయి. అవి రీచ్ కావడం పెద్ద కష్టమేం కాదు అన్నంత ఈజీగా ఉంది మూవీ టీమ్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకులను 1980ల కాలానికి తీసుకువెళ్లబోతున్నాడు సుకుమార్. మొత్తంగా మెగా ఫ్యామిలీలో కూడా రంగస్థలంపై ఎంత క్రేజ్ ఉందనేదానికి అయాన్ స్టిల్లే ఒక ఎగ్జాంపుల్.. 

More Related Stories