English   

అల్లు శిరీష్.. భరత్ తో వస్తున్నాడు

allu sirish comning with master bharath
2018-06-11 16:23:49

ఒకప్పుడు మాస్టర్ భరత్ అనే పేరు పడగానే ఆడియన్స్ ఓ.. ఉన్నాడా అనుకునేవారు. వెంకీ, పోకిరి, ఢీ, రెడీ, కింగ్‌ వంటి సినిమాల్లో అతను పంచిన హాస్యం అంత ఈజీగా మర్చిపోలేరెవరు.  అలా చిన్నప్పుడే ప్రేక్షకుల్లో బాల హాస్యనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్నాడు. టీనేజ్ లోనూ కొన్ని కామెడీ సినిమాల్లో ఆకట్టుకున్న భరత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో నటుడుగా మారుతున్నాడు. అది కూడా అల్లు శిరీష్ సినిమాతో. యస్.. శిరీష్ ప్రస్తుతం ‘ఏబిసిడి’అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఇదే పేరుతో మళయాలంలో వచ్చిన సినిమాకు రీమేక్. అక్కడ దుల్కర్ సాల్మన్ నటించాడు. ఏబిసిడి అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అని అర్థం. 

విదేశాల్లో పుట్టిన హీరో భారత్ కు వస్తాడు. ఇక్కడ కొన్నాళ్ల పాటు అతను మిడిల్ క్లాస్ అబ్బాయిగా బ్రతకాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు.. తన ఇండియన్ జర్నీలో అతను నేర్చుకున్న అంశాలేంటీ అనేది కథ.. అయితే భరత్ పాత్ర ఇందులో ఫుల్ లెంగ్త్ గా ఉంటుంది. దాదాపు హీరోకు సమానమైన పాత్ర అది. సో.. అతన్ని తన సినిమాతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం చేస్తున్నట్టు శిరీషే ట్వీట్ చేస్తూ తెలియజేశాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories