English   

సూర్య సినిమా నుంచి శిరీష్ ఔట్..!

Allu-Sirish
2018-07-21 15:20:28

అల్లు శిరీష్ కూడా అన్న‌య్య మాదిరే ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక్క ఇండ‌స్ట్రీలో ఉండి ఇమేజ్ పెంచుకోవ‌డం కాదు.. అన్ని ఇండ‌స్ట్రీల‌కు వెళ్లి మార్కెట్ పెంచుకోవాల‌ని చూస్తున్నాడు. అందుకే మ‌ళ‌యాలంలో కూడా గ‌తేడాది ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ప‌నిలో ప‌నిగా త‌మిళ‌నాట కూడా సినిమాలు చేస్తా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు. సూర్య 37వ సినిమాలో ఈయ‌న్ని కీల‌క‌పాత్ర కోసం తీసుకున్నారు. కేవీ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్యే షూటింగ్ లండ‌న్ లో మొద‌లైంది. శిరీష్ కూడా అక్క‌డికి వెళ్లాడు. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా ఈ చిత్రం నుంచి శిరీష్ బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఆయ‌న త‌మ సినిమాలో లేడంటూ అఫీషియ‌ల్ గా ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసింది సూర్య చిత్ర యూనిట్. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం తెలుగులో ఏబిసిడి సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌ళ‌యాలంలో హిట్టైన ఈ చిత్రాన్ని ఇక్క‌డ రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా బిజీలోనే డేట్స్ క్లాష్ రావ‌డంతో సూర్య సినిమా నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్పాడు ఈ కుర్ర హీరో. ఓ ర‌కంగా అల్లు శిరీష్ కెరీర్ కు సూర్య సినిమా బంప‌ర్ ఆఫ‌రే. ఎందుకంటే అక్క‌డ కానీ ఈ సినిమా హిట్టైతే త‌మిళ్ లో కూడా అల్లు వార‌బ్బాయికి మార్కెట్ వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్ర హీరో ప్లానింగ్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories