అల్లుడు అదుర్స్ ట్రైలర్ టాక్..మాస్ కామెడీ ఎంటర్టైనర్

టాలీవుడ్ యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'అల్లుడు అదుర్స్'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే పక్కా మాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని తెలుస్తోంది. అలాగే ట్రైలర్ లో కీలకమైన కామెడీ ఎపిసోడ్ నే హైలైట్ చేసి చూపించారు. హీరో ఫ్రెండ్స్ కలిసి విలన్ ఇంట్లో చేసిన హర్రర్ కామెడీ ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. బెల్లంకొండ హీరోకి అలవాటైన ఫైట్స్ ను కూడా యాడ్ చేసారు. సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, తో పాటు జబర్దస్ట్ శ్రీను, చంద్ర తదిరులంతా కనిపించారు. ఈ చిత్రంలో సోనూసూద్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్ లో జోష్ నింపుతున్నాయి.