English   

అల్లు అర్జున్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా..?

allurjun shock with naa peru surya
2018-06-05 22:04:45

ఒక్క ఫ్లాప్ మొత్తం ఆటిట్యూడ్ నే మార్చివేస్తుందంటే ఏమో అనుకుంటాం.. కానీ కొన్ని సందర్భాల్లో అవి నమ్మాల్సి వస్తుంది. గతంలో మహేష్ బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్ అలా చేస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ ఇచ్చిన షాక్ నుంచి బన్నీ ఇంకా తేరుకున్నట్టు లేదు. అందుకే కొత్త సినిమా విషయంలో ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. అతను కొందరు దర్శకులతో పనిచేయాలనుకుంటున్నాడు.. కానీ వాళ్లెవరూ ఇప్పుడు ఖాళీగా లేరు.. ఉన్నా బన్నీతో చేసే ఆలోచనలో లేరేమో అనిపిస్తుంది. దీంతో అల్లు అర్జున్ ఇంకా ఇబ్బందిలో పడిపోతున్నాడు. దీంతో తను నెక్ట్స్ చేయబోయే దర్శకుడు అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నా.. ఇతను కన్ఫర్మ్ అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా(రు)డు. 

అల్లు అర్జున్ నా పేరు సూర్యపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కారణం అతని గత సినిమాలు కమర్షియల్ గా క్లిక్ అయినా.. ‘మంచి’సినిమాలు అనిపించుకోలేకపోయాయి. ఈ సారి అటు మంచి సినిమా కాలేదు.. ఇటు కమర్షియల్ గానూ ఆడలేదు. దీంతో రీ థాట్ లో పడ్డాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో, కొరటాల శివ, రాజమౌళి రేంజ్ దర్శకులతో పనిచేయాలనుకుంటున్నాడు. కానీ ఆ ఇద్దరూ ఇతనితో చేసే పనిచేసే పరిస్థితి లేదిప్పుడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్టుగా విక్రమ్ కుమార్ సీన్ లోకి వచ్చాడు. బన్నీ, విక్రమ్ కుమార్ ఆల్మోస్ట్ ఫైనల్ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడీ ప్రాజెక్ట్ కూడా మళ్లీ పెండింగ్ లో పడే అవకాశం ఉందంటున్నారు. కారణం.. విక్రమ్ కు కమర్షియల్ డైరెక్టర్ గా పెద్ద పేరు లేదు. దీంతో విక్రమ్ తో చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడట అల్లు అర్జున్. 

ఇక విక్రమ్ కూడా సైడ్ అయితే అల్లు అర్జున్ మళ్లీ ఎవరితో చేస్తాడనే ప్రశ్న మళ్లీ కామన్ అవుతుంది. ఏదేమైనా మనోడికి వక్కంతం వంశీ సూర్యతో మర్చిపోలేని షాక్ ఇచ్చినట్టే ఉన్నాడు. అందుకే ఇంకా తేరుకోలేకపోతున్నాడు. 

More Related Stories