English   

అమ‌లాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్.. 

Amala-Paul-Second-Innings-Adhurs
2017-05-03 04:09:21

పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల‌కు పెద్ద‌గా లైఫ్ ఉండ‌దు. బాలీవుడ్ లో ఏమో గానీ మ‌న ద‌గ్గ‌ర మాత్రం పెళ్లైన ముద్దుగుమ్మ‌ల‌ను ఆంటీలుగా చూస్తారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ అమ‌లాపాల్ విష‌యంలోమాత్రం ఇది జ‌రగ‌డం లేదు. ఈ భామ‌కు విడాకులు పూర్తిగా మంజూరు అయిపోయాయి. కోర్ట్ కూడా తాజాగా విజ‌య్ తో విడాకుల్ని ఆమోదించింది. ఇక ఇప్పుడు అమ‌ల ఫ్రీ బ‌ర్డ్. అందుకే త‌న విశ్వ‌రూపం చూపించేస్తుంది అమ‌లాపాల్. మొన్న‌టి వ‌ర‌కు భర్త కంట్రోల్ లో ఉండ‌ట‌మో ఏమో గానీ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు కాస్త అడ్డుక‌ట్ట వేసింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఎవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన ప‌నిలేదు. పంజ‌రం నుంచి విడుద‌లైన ప‌క్షిలా రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి.

ఇదే అనుకుంటే ఈ మ‌ధ్య మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది అమ‌లాపాల్. ఆ ఫోటోల్లో అమ్మ‌డి ర‌చ్చ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు ఈమె సినిమాల్లోనూ ఓ రేంజ్ లో హాట్ షో చేస్తుంది. దీనికి సాక్ష్యం హెబ్బులి సినిమా. క‌న్న‌డ‌లో సుదీప్ హీరోగా తెర‌కెక్కిన‌ సినిమాలో అమ‌లాపాల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో క‌న్న‌డ‌నాట సూప‌ర్ హిట్ తో అడుగుపెట్టింది అమ‌లా. తాజాగా ఈ సినిమా 75 రోజుల్ని పూర్తి చేసుకోవ‌డ‌మే కాదు.. 100 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది. దాంతో క‌న్న‌డ నాట తొలి 100 కోట్ల హీరోయిన్ గా చ‌రిత్రలో నిలిచిపోయింది ఈ కేర‌ళ‌కుట్టి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ ఈ బ్యూటీకి బాగానే క‌లిసొచ్చింది.

More Related Stories