English   

జెర్సీ తమిళ్ రీమేక్ లో ఆమె ?

Amala Paul
2019-08-13 19:14:11

నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే ఇది నాని కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దిల్ రాజు - అరవింద్ లు సిద్దం అవుతున్నారు. అయితే ఈ సినిమాని తమిళ్ లో కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జెర్సీ తమిళ రీమేక్‌ రైట్స్‌ను హీరో రానా దక్కించుకున్నారని ప్రచారం కూడా జరిగింది. ఆయన నిర్మాతగా ఆ సినిమా నిర్మించనున్నారని అంటున్నారు. 

హీరో విష్ణు విశాల్ తమిళ జెర్సీ హీరోగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో తెలుగులో శ్రద్దా శ్రీనాద్ పోషించిన పాత్రను అమలా పాల్ పోషించనుందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి రాక్షసన్ సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అమలాపాల్ ఒప్పుకుంటే రాక్షసన్ తర్వాత నటించే సినిమా ఇదే అవుతుంది. అయితే ఈ సినిమాని తమిళ నేటివిటీ కోసం మార్పులు చేయనున్నారట. కానీ ఈ అన్ని విషయాల మీదా అధికారికంగా క్లారిటీ రావల్సి వుంది. 

More Related Stories