English   

త‌ల‌కిందులైన అమ‌లాపాల్.. 

Amala-Paul
2018-05-15 09:09:36

ఇప్పుడేంటి.. ఆమె పెళ్లి చేసుకున్న‌పుడే అమ‌లాపాల్ కెరీర్ త‌ల‌కిందులు అయిపోయింది క‌దా.. ఇప్పుడు కొత్త‌గా అవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. కానీ ఇక్క‌డ నిజంగానే త‌ల‌కిందులైపోయింది ఈ బ్యూటీ. యోగాలో భాగంగా కాళ్లు పైకి.. త‌ల కింద‌కి చేసి ఏదో ఆసనం ట్రై చేస్తుంది ఈ భామ‌. ఒక‌ప్పుడు అందాల ఆర‌బోత విష‌యంలో కాస్త పొద‌పుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు బ‌ట్టల విష‌యంలో పొదుపు పాటిస్తుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఆ మ‌ధ్య త‌న బ‌ర్త్  డే కోసం అమెరికా వెళ్లి..  అక్క‌డ్నుంచే చిట్టి క్యాస్ట్యూమ్స్ లో ఫోటోలు దిగి ర‌చ్చ చేసింది అమ‌లాపాల్.

ఇదే అనుకుంటే ఈ మ‌ధ్య మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది అమ‌లాపాల్. ఆ ఫోటోల్లో అమ్మ‌డి ర‌చ్చ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు ఈమె సినిమాల్లోనూ ఓ రేంజ్ లో హాట్ షో చేస్తుంది. దీనికి సాక్ష్యం హెబ్బులి సినిమా. క‌న్న‌డ‌లో సుదీప్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాలో అమ‌లాపాల్ ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది అమలాపాల్. దానికితోడు ఈ మ‌ధ్యే ఓ మ‌ళ‌యాలం సినిమా కోసం ఏకంగా సిగ‌రెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ ర‌చ్చ చేసింది. ఇక ఇప్పుడు యోగా పేరుతో మ‌రింత ర‌చ్చ చేస్తుంది. మొత్తానికి రీ ఎంట్రీలో ర‌చ్చ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్లుంది ఈ ముద్దుగుమ్మ‌.              

More Related Stories