English   

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంతా రెడీ.. 

Ravi-Teja

ర‌వితేజ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ర‌వితేజ ఖాతాలో రాజా ది గ్రేట్ అనే హిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయ‌న కూడా ఫ్లాప్ హీరోనే. ఈయ‌న న‌టించిన ట‌చ్ చేసి చూడు దారుణంగా డిజాస్ట‌ర్ అయింది. ఈ చిత్రం క‌నీసం 12 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది.  ర‌వితేజ మార్కెట్ ఎలా ప‌డిపోయిందో ఈ చిత్రమే చెప్పింది. దాంతో ఇప్పుడు క‌చ్చితంగా హిట్ కొట్టి త‌న మార్కెట్ నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు మాస్ రాజా. ఇలాంటి టైమ్ లో హిట్ల‌లో ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమా చేయాలి కానీ ర‌వితేజ మాత్రం హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌బోతున్నాడు. అత‌డే శీనువైట్ల‌. 

ఇప్పుడు ఈయ‌న క‌ళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్రిల్ నాటికి విడుద‌ల కానుంది. ట‌చ్ చేసి చూడు ఫ్లాప్ తో ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ‌పై ఒత్తిడి పెరిగింది. ఇదే టైమ్ లో శీనువైట్ల సినిమా కూడా ఓకే చెప్ప‌డంతో ర‌వితేజ‌పై చెప్ప‌లేనంత ప్రెజ‌ర్ వ‌చ్చేసింది. కాక‌పోతే ఈ క‌థ‌పై మ‌రోసారి పూర్తిగా దృష్టి పెట్టాలంటూ శీనువైట్ల‌ను కోరాడు ర‌వితేజ‌. పైగా ఇది మామూలు క‌థ కాదు.. ఇందులో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో న‌టించ బోతున్నాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌ర‌హా క‌థ ఇది. టైటిల్ కూడా అదే. అయితే క్యాచీగా ఉంటుంద‌ని అ..అ..అ అని పెడుతున్నాడు శీనువైట్ల‌. ఈ క‌థ‌పైనే ప్ర‌స్తుతం కుస్తీ ప‌డుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫిబ్ర‌వ‌రి 19న అమెరికాలో ఈ చిత్రం ముహూర్తం జ‌రుపుకోనుంది. ఎప్రిల్ నుంచి ర‌వితేజ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ర‌వితేజ‌, శీనువైట్ల‌ను బ‌య‌ట ప‌డేస్తారో లేదో..?

More Related Stories