English   

అమెజాన్ లో అమేజింగ్ రేటు పలికిన సాహో..

amazon
2019-08-24 07:39:50

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు సాహో భజన చేస్తుంది. అన్ని ఇండస్ట్రీలలో సాహో మేనియా నడుస్తుంది. విడుదలైన తర్వాత వసూళ్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ విడుదలకు ముందే ఈ చిత్రం నిర్మాతలకు లాభాల్లో ముంచేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో 340 కోట్లు దాటిన సాహో సినిమా రైట్స్ రూపంలో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతుంది. శాటిలైట్ రైట్స్ ఇప్పటికే దాదాపు 100 కోట్ల వరకు పలికాయని తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి 100 కోట్లు బేరం కుదుర్చుకున్నాయి ఛానల్స్. మరోవైపు డిజిటల్ మీడియాలో ఈ సినిమా కోసం భారీ పోటీ ఏర్పడింది. అందరినీ వెనక్కినెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సాహో సినిమాను ఏకంగా 42 కోట్లకు దక్కించుకుందని తెలుస్తుంది. తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల కోసం ఇంత భారీ మొత్తం చెల్లించింది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రేమ్ లో ఒక సినిమా కోసం ఎంత ఎక్కువ రేటు పెట్టడం ఇదే తొలిసారి. సైరా సినిమా కోసం నాలుగు భాషలకు కలిపి 32 కోట్లు చెల్లించారని తెలుస్తోంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే సాహో కోసం చెల్లిస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్ లో విడుదల చేయాలనేది అమెజాన్ తో దర్శక నిర్మాతలు పెట్టుకున్న ఒప్పందం. ఏదేమైనా కూడా కేవలం అమెజాన్ రూపంలోనే 42 కోట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ వగైరా వగైరా కలుపుకుంటే కేవలం ఈ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు 160 కోట్ల వరకు వచ్చాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ 330 కోట్లకు పైగానే జరిగింది. ఈ లెక్కన సాహో విడుదలకు ముందే 500 కోట్ల వ్యాపారం చేసింది. దీన్నిబట్టి ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ప్రభావం రేపు విడుదలయిన తర్వాత థియేటర్లలో సాహో సినిమా చూపిస్తుందో లేదో చూడాలి.

 

More Related Stories