English   

40 ఏళ్ల ఫిగ‌ర్ పిచ్చెక్కిస్తుందిగా..

Ameesha-Patel

నిజంగా ఇప్పుడు అమీషా ప‌టేల్ ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది లేక‌పోతే మ‌రేంటి..? 30 ఏళ్ల‌కే ఫిగ‌ర్ మెయింటేన్ చేయ‌లేక చాలా మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. కానీ అమీషా మాత్రం ఇప్ప‌టికీ అందాల త‌మాషా చేస్తూనే ఉంది. అస‌లు ఈ ముద్దుగుమ్మ‌ను చూసి అంతా ఫిదా అవుతున్నారు ఇప్ప‌టికీ కూడా. ఈ భామ‌కు తెలుగులో ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌ర‌స‌న బ‌ద్రి సినిమాలో న‌టించింది ఈ భామ‌. హిందీలో క‌హో నా ప్యార్ హై లాంటి సినిమాతో అడుగు పెట్టిన అమీషా.. కొన్నాళ్లు అక్క‌డ బాగానే వెలిగిపోయింది. తెలుగులోనూ నాని, న‌ర‌సింహుడు, ప‌ర‌మ వీర‌చ‌క్ర లాంటి సినిమాల్లో న‌టించింది. 

బద్రి మిన‌హా అన్నీ డిజాస్ట‌ర్లే. వ‌య‌సు 40 దాటేసింది. దాంతో ఆటోమేటిక్ గా అవ‌కాశాలు కూడా దూరం అవుతున్నాయి. త‌న తోటి హీరోయిన్లు ఐశ్వ‌ర్యారాయ్.. విద్యాబాల‌న్ లాంటి వాళ్లు 40స్ లోనూ ఇంకా ఆఫ‌ర్లు సాధిస్తుండ‌టంతో తాను కూడా అదే ప‌ని చేయాల‌ని చూస్తుంది అమీషా ప‌టేల్. అందుకే త‌న వ‌య‌సు కూడా మ‌రిచిపోయి అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా ఫోటోషూట్ చేసిన అమీషా.. అందులో అందాల త‌మాషా చేసింది. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొట్టేసింది. ఈ మ‌ధ్యే బ్లాక్ బికినీలో అమ్మ‌డు ఇచ్చిన పోజ్ కు అంద‌రి మ‌తులు చెడిపోయాయి. ఇక ఇప్పుడు జిమ్ కు వెళ్లి త‌న ఫిజిక్ ను మ‌రింత మెరుగు పరుచుకుంటుంది అమీషా. మొత్తానికి చూస్తుంటే ఏజ్ పెరిగినా.. గ్లామ‌ర్ కోసం హ‌మేషా క‌ష్ట‌ప‌డేలా ఉంది ఈ అమీషా. 

More Related Stories