English   

అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్..కరోనా నెగెటివ్

Amitabh Bachchan
2020-08-02 17:53:35

కరోనా పాజిటివ్ కి గురై ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే, తనకు మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పారు.‘తాజాగా చేసిన కొవిడ్-19 పరీక్షలో మా నాన్నకు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు’’ అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.  మరోవైపు తను కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ బచ్చన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోనున్నట్లు చెప్పారు. బచ్చన్‌ కుటుంబంలో కరోనా బారిన పడిన ఐశ్వర్య, ఆరాధ్య ఇటీవల కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

More Related Stories