English   

సైరా లో గురువు గారి లుక్ బయటికి వచ్చేసింది

Amitabh Bachchan First Look Released From Sye Raa Narasimha Reddy
2018-10-11 11:52:35

సైరా సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి అంద‌ర్లోనూ ఒక‌టే ఆస‌క్తి ఉంది. అస‌లు ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుంది..? ఎన్ని రికార్డులు తిర‌గ‌రాయ‌బోతుంది అని.. చాలానే ఊహించుకుంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఉండే కాస్టింగ్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ఒక్కో బ‌ర్త్ డే యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొన్న‌టికి మొన్న సుదీప్ బ‌ర్త్ డే రోజు ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు సైరా టీం. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డేకు ఆయ‌న టీజ‌ర్ విడుద‌ల చేసారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ బ‌ర్త్ డే గిఫ్ట్ కూడా సిద్ధం చేశారు. అక్టోబ‌ర్ 11న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇందులో అమితాబ్ లుక్ విడుద‌ల చేశారు.

Amitabh Bachchan First Look Released From Sye Raa Narasimha Reddy

సైరా కోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు అమితాబ్ బచ్చ‌న్. న‌ర‌సింహారెడ్డి గురువు గోసాయి వెంక‌న్న పాత్ర‌లో బిగ్ బి న‌టిస్తున్నాడు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి ఎప్ప‌టిక‌ప్పుడు దారి చూపే పాత్ర ఇది. ఈ పాత్ర‌కు అమితాబ్ అయితేనే స‌రిగ్గా సూట్ అవుతాడ‌ని ఆయ‌న్నే లైన్ లోకి తీసుకొచ్చాడు చిరంజీవి. ఈ మెగాస్టార్ అడిగేస‌రికి ఆ మెగాస్టార్ కాద‌న‌లేక ఒప్పుకున్నాడు.

More Related Stories