English   

పాపం బిగ్ బి ఫేక్ న్యూస్‌తో మళ్లీ బుక్ అయ్యాడుగా.. 

 Amitabh Bachchan
2020-04-08 16:07:45

అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ ను కొన్ని రోజుల కింద ట్విట్టర్ అఫీషియల్ గా డిలీట్ చేసింది. ఈయన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై విమర్శలు కూడా చేసారు కొందరు. ముఖ్యంగా కరోనా గురించి ఈయన ఓ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసారంటూ ఆ మధ్య ఈయనతో పాటు పవన్ చేసిన ట్వీట్స్ తీసేసింది ట్విట్టర్. ఇది జరిగి కూడా మూడు వారాలు అయిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈయన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసారు. తెలియక చేసిన చిన్న తప్పు ఇప్పుడు ఈయన్ని విమర్శల పాలయ్యేలా చేస్తుంది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. దేశ ప్రజలు సంఘీభావం తెలపడం కోసం మొన్న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంటి ముందు దీపాలు వెలిగించాలని మోదీ చెప్పాడు.. దేశం మొత్తం ఆయన చెప్పినట్లే చేసారు కూడా. విద్యుత్ దీపాలతో భారత్ వెలిగిపోతున్నట్లుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. దాన్ని ఓ వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అమితాబ్ రీ ట్వీట్ చేశారు.పైగా ఈ ఫోటోను ట్వీట్ చేసి.. ప్రపంచం మనల్ని ఒకటిగా చూస్తుందంటూ అమితాబ్ దీనికి క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఓ వైపు దీపాలు వెలిగించాలంటే కరెంట్ లైట్స్ ఉన్న ఫోటోలను ట్వీట్ చేయడం ఏంటి అంటూ అమితాబ్ తో ఆడుకుంటున్నారంతా. 

దాంతో ఫేక్‌ న్యూస్ రాజు మళ్లీ వచ్చేసాడంటూ ఆయనపై పడిపోయారంతా. ఆయన అకౌంట్‌ని సస్పెండ్ చేయాలంటూ ట్విట్టర్ ను కోరాడు ఓ నెటిజన్. గతంలో కూడా మార్చ్ 23న జనతా కర్ఫ్యూ ముగిసిన తర్వాత ప్రజల కోసం కృషి చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశ ప్రజలు అంతా చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. ఇలా చప్పట్లు కొడితే ఆ వైబ్రేషన్ కు వైరస్ చనిపోతుందన్న ఫేక్‌న్యూస్‌ని కూడా షేర్ చేసి.. అమితాబ్ విమర్శల పాలయ్యాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఇలా బుక్ అయిపోయాడు బిగ్ బి పాపం. 
 

More Related Stories