English   

అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు..

Amithab Bachchan.jpg
2020-07-11 23:32:15

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కూడా వచ్చింది. ఆయన తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడ్డాడు. ఇదే విషయాన్ని స్వయంగా అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కొన్ని రోజులుగా అమితాబ్ ఆరోగ్యం అయితే బాగానే ఉంది. కానీ అప్పట్లో మాత్రం ఈయన కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉండి చికిత్స కూడా తీసుకున్నాడు.

అనారోగ్యం నుంచి కుదుటపడిన తర్వాత వరస సినిమాలు కూడా చేసాడు బాలీవుడ్ మెగాస్టార్. మళ్లీ ఇన్నాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే ఈయన్ని హాస్పిటల్ కు షిఫ్ట్ చేసారు. ఈయన వయసు కూడా 80 ఏళ్లకు చేరువలో ఉండటంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

మరోవైపు తనను గత 10 రోజులుగా కలిసిన వాళ్లంతా వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ట్వీట్ చేసాడు బిగ్ బి. తన కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పాడు బాలీవుడ్ మెగాస్టార్. ప్రస్తుతం ఈయనకు నానావతి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. 

More Related Stories