English   

కమ్మరాజ్యంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. 

Amma Rajyam lo Kadapa Biddalu
2019-12-07 17:49:55

కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. నవంబర్ 29నే విడుదల కావాల్సిన సినిమా ఇంకా రాకపోవడంతో అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ. ఈ చిత్రానికి కట్స్ ఇచ్చి విడుదల చేసుకోమని తీపికబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ రివైజింగ్ కమిటీ తీర్మానం చేసింది. కొన్ని కట్స్ ఇచ్చి ఈ సినిమాను విడుదల చేసుకోండి అంటూ వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ. ఈ సినిమాకు కమ్మరాజ్యంలో అని కాకుండా టైటిల్ మార్చేసాడు దర్శకుడు వర్మ. దీనికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ మార్చేసాడు ఆర్జీవీ. యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోమ్మని వర్మకు చెప్పడంతో అభిమానులు కూడా ఆసక్తిగా సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు.

More Related Stories