English   

పుష్పక విమానం తో వస్తున్న ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda
2021-03-01 17:22:00

దొరసాని లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా "పుష్పక విమానం" అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ...ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత క్యారెక్టర్స్ ని జోడించి తయారు చేసుకున్నాను. మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో  ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. 

అదే టైం లో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా రిలీజ్ అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే  పరిస్థితులని చూపెడుతుంది . ఇందులో ఆనంద్ తో పాటు సునీల్,  నరేష్ ముఖ్య పాత్రలలో  కనిపించనున్నారు.శాన్వి మేఘన,గీత్ సాయిని , ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది." అని అన్నారు.

More Related Stories