English   

విజయ్ తమ్ముడి రెండో సినిమా....మరో కొత్త కాంబో ? 

 Anand deverakonda
2019-08-13 09:12:11

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో స్టార్ హీరో హోదా అనుభవిస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిజం చేస్తూ తన తమ్ముడిని కూడా హీరోను చేసుకున్నాడు. పైకి మాత్రం ఇదంతా వద్దని చెప్పానని చెబుతున్నా ఆ దొరసాని సినిమా నిర్మాతల్లో విజయ్ ఆనంద్ ల మేనమామ కూడా ఒకరయి ఉండడం, ఆయన పెళ్లి చూపులు సినిమా నిర్మాతల్లో కూడా ఒకరు అవడంతో విజయ్ ప్రోత్సాహం ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే ఎక్కడా తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయని దేవరకొండ చివర్లో రిలీజ్ అవుతుందనంగా కాస్త ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి తమ్ముడి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా చేశాడు. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా కధాపరంగా మంచి పేరు వచ్చినా నటుడిగా ఆనంద్ దేవరకొండకి మంచి పేరు తేలేకపోయింది. అయితే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమా రిలీజ్ కాక ముందే ఈయన రెండో సినిమా చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. ఎవరూ కన్ఫాం చేయలేదు కానీ ఈయన రెండవ సినిమా గీతా ఆర్ట్స్‌లో చేసే అవకాశం ఉందని, అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. విజయ్ కి అనుకున్న స్క్రిప్ట్ తమ్ముడికి ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అదే కాక ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసి ఫేడవుట్ అయిన పవన్ సాదినేని దర్శకత్వంలో కూడా ఈయన సినిమా చేయనున్నాడని దొరసాని నిర్మాత మధుర శ్రీధర్ ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాలు ఏవీ కన్ఫాం కాలేదు కానీ మరో కొత్త ప్రచారం మొదలయ్యింది. అదేంటంటే ఈయన రెండో సినిమా భవ్య క్రియేషన్స్ లో ఉండనుందట. భవ్య క్రియేషన్స్ ప్రోదక్స్గాన్ నెంబర్ 12గా తెరకెక్కనున్న సినిమాలో ఆనంద్ హీరోగా ఎంపికయ్యాడని రచయితగా పలు సినిమాలకి పని చేసిన వినోద్ అనంతోజు అనే ఆయన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తమ్ముడికి మొదటి సినిమా క్రేజ్ తేలేక పోవడంతో రెండో సినిమా చేయాల్సిందిగా ఆనంద్‌ ప్రసాద్‌ ను విజయ్‌ దేవరకొండ రిక్వెస్ట్ చేశాడనే ప్రచారం జరుగుతోంది.

More Related Stories