English   

మహేష్ కోసం దేవరకొండ హీరోయిన్ 

Mahesh Ananya Panday
2020-08-05 07:42:14

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే పాత్ర ఇదేనంటూ ఒక ప్రచారం గట్టిగా జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో కీర్తి బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనుందని సమాచారం. ఇక మహేష్‌ బాబు తల్లి బ్యాంకు అధికారిగా పనిచేస్తుందట. ఆమె కింద బ్యాంకు ఉద్యోగిగా కీర్తి సురేష్‌ నటించనుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నా ఆ విషయం మీద అయితే క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని రోప్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆమె ఎవరో కాదు అనన్య పాండే. హిందీలో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన అనన్య ప్రస్తుతం తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్ చివరకు అనన్యపాండేను ఓకే చేశారని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

More Related Stories