English   

అనసూయ మొదటి బాయ్‌ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా..?

anasuya
2020-05-24 16:19:28

యాంకర్ అనసూయ సినిమాలు, రియాలిటీ షోలే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా లాక్‌డౌన్ పుణ్యమా అని ప్రతీ రోజూ ఏదో ఓ టైమ్ లో వచ్చి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. మరికొన్ని సార్లు మాత్రం తానే స్వయంగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వాటి గురించి వివరిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ. తన భర్త భరద్వాజ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన అనసూయ.. దానికి వివరణ కూడా ఇచ్చింది. తనకే కాదు పెళ్లైన ఏ అమ్మాయికి అయినా కూడా తన భర్తే మొదటి బాయ్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. తన వరకు నా మొదటి‌, రెండో, మూడో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చింది. తన పెళ్లి జరిగి పదేళ్లు అవుతుందని.. తాము ఈ ఏడాది వెడ్డింగ్ యానివర్సరీని ఇటలీలో జరుపుకోవాలని ప్లాన్ చేసామని తెలిపింది అనసూయ. అయితే కరోనా వచ్చి అంతా పాడు చేసింది. ప్రస్తుతం పరిస్థితులు చూసిన తర్వాత అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది అనసూయ.

More Related Stories