మళ్ళీ తల్లిని కావాలని ఉంది..జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీగా వుంది. అంత బిజీగా ఉన్నా.. ఈ హాట్ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ కుర్రకారుకు మతిపోగొడుతూ ఉంటుంది. అనసూయ ఫోటో పెట్టిందంటే కింద కామెంట్లు, లైకుల వర్షం కూడా కురవాల్సిందే. ఇలా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే అనసూయ ఇంటర్వ్యూ లలో చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఇప్పుడు మరోసారి తల్లి కావాలనుకుంటున్నట్టు చెప్పింది.
"ఆ మాతృత్వపు మధురిమ మరోసారి అనుభవించాలని వుంది" అంటూ పేర్కొంది. మరి అనసూయ భర్త ఈ విషయంలో ఏం అనుజునటున్నారో తెలీదు కానీ అనసూయ మాత్రం మళ్ళీ పిల్లలను కనాలనే ఆశతో ఉన్నట్టు అర్థమయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనసూయ "థాంక్యూ బ్రదర్" అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో అనసూయ ప్రెగ్నెన్సీ లుక్ తో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమా నేపథ్యంలోనే అనసూయ మళ్ళీ తల్లి కావాలని ఆశపడుతూ కామెంట్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక నిజ జీవితంలో ఏమో గాని ఈ సినిమాతో మాత్రం అనసూయ కల స్క్రీన్ పై నెరవేరబోతుంది.