English   

ఓసీ నా రంగమ్మత్తో 

anasuya-rangasthalam

ఈ స్టిల్ చూస్తే ఇట్టాగే అనుకుంటారెవరైనా.. ఇన్నాళ్లూ చూసిన అనసూయ వేరు.. ఇకపై చూసే అనసూయ వేరు. ఆ రేంజ్ లో ఉంది రంగమ్మత్త. సారీ అనసూయ. ఇన్నాళ్లూ పట్నం కట్టుబొట్టుతో సోయగాలారబోసిన అనసూయ ఒక్కసారిగా విలేజ్ బ్యూటీగా మారిపోయింది. కాటన్ చీర.. పిక్కలపైకి గోచీపోసి, నల్లని జాకెట్టుకు తోడు మెళ్లో పసుపుతాడు, పావలా కాసంత కాటుక బొట్టుతో కంగారెట్టేత్తాందీ రంగమ్మత్త. సినిమాలో తన క్యారెక్టర్ ఎట్టా ఉంటుందో గానీ నా సామిరంగా ఈ బొమ్మ సూత్తే మాత్రం ఓసీ నా రంగమ్మత్తో అనుకోకుండా ఉండలేరెవురూ.. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలంతో తన స్టార్ గట్టిగా తిరుగుతుందని నమ్ముతోంది అనసూయ. ఈ బొమ్మ చూస్తే అది నిజమే అనేలా ఉంది. కొందరు సమంతకు అమ్మ అంటున్నారు. మరికొందరు కుమార్ బాబకు జోడీ అంటున్నారు.. ఇంకొందరు.. ఇంకేదో అంటన్నారు. ఆళ్లెవురేవనుకున్నా .. రంగమ్మత్త మాత్రం అద్దిరిపోయింది.. అంతే. 

More Related Stories